Bollywood Actresses | ఖరీదైన కార్లు వాడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు.. జాన్వీ అయితే ఏకాంగా..

Bollywood Actresses | ఖరీదైన కార్లు వాడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు.. జాన్వీ అయితే ఏకాంగా..బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కడికివెళ్లినా జనాల కళ్లు అన్నీ తమవైపు తిప్పుకునేలా చేస్తారన్న విషయం తెలిసిందే. వాళ్లతో సెల్ఫీ కోసం ఇక అభిమానుల పాట్లు చెప్పేవి కాదనుకోండి.వాళ్లు వాడే చెప్పులు,డ్రెస్ లు,హ్యాండ్ బ్యాగ్ లు,తిరిగే కార్లు అన్నీ కొత్తగా,వెరైటీగా,ఖరీదైనవిగా ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో ఏడుగురు టాప్ హీరోయిన్లు వాడుతున్న అత్యంత ఖరీదైన కార్ల గురించి ఒకసారి చూద్దాం.

1. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా

ఈ బాలీవుడ్ బ్యూటీ రోల్స్ రాయిస్ గోస్ట్ కారుని వాడుతోంది. దీని ధర రూ.5.65 కోట్లు. ఈ కారులో స్టార్‌లిట్ సీలింగ్‌లు మరియు స్టార్‌డస్ట్ తివాచీలు ఉండటమే కాకుండా, బిఎమ్‌డబ్ల్యూ తయారు చేసిన 6.6-లీటర్ ట్విన్-టర్బో V12 ను కలిగి ఉంది. ఇది 563 బిహెచ్‌పి పవర్ ని కలిగిస్తుంది. ఈ కారులో ప్రయాణిస్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…రిక్లెనయిర్ సీట్స్(పడుకునే సీట్లు)ఉన్న కార్లలో ప్రయానం చేయడం తనకు చాలా ఇష్టమని తెలిపింది.

సన్నీ లియోన్

సన్నీలియోన్ బయట ఎక్కడైనా పబ్లిక్ లో కనిపించిందంటే చాలు చుట్టూ ఈగలమాదిరిగా జనాలు గుమిగూడతారు. మొన్నామధ్య సన్నీ కేరళలోని కొచ్చిన్ వెళ్లినప్పుడు లక్షల మంది జనం చీమల్లా సన్నీ కారుచుట్టుముట్టారు. తన ప్యాన్స్ అందరికీ సెల్ఫీలు ఇవ్వాలంటే సన్నీకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. ఈ బ్యూటీ లిమిటెడ్ ఎడిషన్ మసెరటి ఘిబ్లి నెరిసిమో కారుని 2017లో ఇంటికి తెచ్చుకుంది. ప్రపంచంలో ఈ మోడల్ కారులు 450మాత్రమే ఉన్నాయంట. ఈ 450 కార్లలో ఒకటి సన్నీ దగ్గర ఉంది. దీని ధర రూ.1.36కోట్లు. నిస్సందేహంగా సన్నీ గ్యారేజ్ లో ఉన్న ఖరీదైన,మోస్ట్ పవర్ ఫుల్ కార్లలో ఇది ఒకటి. కేవలం 4.7సెకన్ల వ్యవధిలోనే 0-100కిలోమీటర్ల స్పీడ్ తో,గంటలకు 283 కిలోమీటర్లకు చేరుకోగలదు ఈ కారు.

కరీనా కపూర్

ఈ బాలీవుడ్ బేగం సాధారణంగా భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారుడు తైమూర్‌లతో కలిసి వైట్ రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో ముంబై రోడ్లపై తిరుగుతుంటది. ఈ కారు పెట్రోల్,డీజిల్ రెండు ఆప్షన్లు కలిగి ఉంటది. 5లీటర్ గ్యాస్ ట్యాంక్, ఇంజన్లు రేంజ్ V6s నుండి సూపర్ఛార్జ్డ్ V8 వరకు ఉంటాయి. ఈ కారు బరువు 2.8టన్నులు ఉంటుంది. కేవలం 5.3 సెకన్లలోనే సున్నా నుంచి వంద స్పీడ్ వరకు ఈ కారు ప్రయాణించగలదు. దీని ధర రూ.1.56కోట్లు.

జాన్వీ కపూర్

ప్రస్తుతం అత్యంత చిన్నవయస్సు ఉన్న బాలీవడ్ హీరోయిన్లలో జాన్వీకపూర్ ఒకరు. ఈ అమ్మడు ఇటీవల బ్యాండ్ న్యూ మెర్సిడెస్-మేబాచ్ S650కారుని కొనుగోలు చేసింది. 2కోట్ల రూపాయల ఖరీదైన ఈ కారు నెంబర్ MH02FG7666. ఈనెంబర్ కి ఓ ప్ర్యతేకత ఉందండోయ్. ఈ చివరి నాలుగు అంకెలు… తన తల్లి దివంగత శ్రీదేవి వాడిన వైట్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు చివరి నాలుగు అంకెలు ఒకటే.

Recent Posts

Leave a Reply