Arvind Kejriwal | ముఖ్యమంత్రి, కేజ్రీవాల్ అరెస్ట్.. ఢిల్లీలో హైటెన్షన్..

allroudadda

Arvind Kejriwal | ‘ఢిల్లీ మద్యం పాలసీ’ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ అరెస్టును ఆప్‌ నేతలు ఖండించారు. అరెస్టుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి సీఎం ఇంటిముందు భారీగా ఆందోళనలు చేపట్టారు. దీంతో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఇంటి పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు గురువారం ఈడీ తొమ్మిదోసారి సమన్లు జా రీ చేసింది.

ఈ నేపథ్యంలో ఈడీ తనను బలవంతంగా అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ర క్షణ కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం ఉదయం విచారించిన హైకో ర్టు.. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను చూపించాలని ఈడీని ఆదేశించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు కొ న్ని పత్రాలు ఉన్న సీల్డ్‌ కవర్‌ను ఈడీ అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు.

allroudadda
allroudadda

మరో పక్క హేమంత్ సోరెన్ అరెస్ట్ సమయంలోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి. కస్టడీలోకి తీసుకునే ముందు ఈడీ అధికారులు కొద్దిసేపు ప్రశ్నించారు. జనవరి 31న రాంచీలో హైడ్రామా తర్వాత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్‌కు హేమంత్ సోరెన్ దాదాపు 48 గంటలపాటు కనిపించకపోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.

Tangella Uday | జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

ఈడీ అరెస్టుకు ముందే రాజీనామాపై పార్టీలో అంతర్గతంగా చర్చించారు. ఆ తర్వాత ఈడీ అరెస్ట్ చేయడం, సీఎం పదవికి ఆయన రాజీనామా చేయడం, ఝార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.కాగా అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపించడం లేదు. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు గురువారం రాత్రి ప్రకటించారు. దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply