Ayodhya Ram Mandir | రామయ్య కళ్లు చెక్కేటప్పుడు పెద్ద అధ్బుతం జరిగింది..

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరం నిర్మాణం ఒక ఎత్తు అయితే, దానిలో ప్రతిష్టించిన ‘బాలక్ రామ్’ విగ్రహం ఒకటీ మరో ఎత్తు అని అందరూ ఒప్పుకుంటారు. అయోధ్య రామ మందిరం ఎంత అద్భుతంగా ఉందో ‘బాలక్ రామ్’ విగ్రహం అంతకంటే అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతున్నట్లుందని అందరూ ముక్తకంఠంతో చెపుతున్న మాట! ఆ అపురూపమైన విగ్రహాన్ని చెక్కిన మైసూరుకి చెందిన శిల్పి అరుణ్ యోగి రాజ్‌, విగ్రహం చెక్కేటప్పుడు తన అనుభూతిని, ఎదుర్కొన్న సవాళ్లను మీడియా ప్రతినిధులకు వివరించారు.

ఆ విగ్రహం చెక్కుతున్నప్పుడే తన మనసులో ఓ గొప్ప అనుభూతి, సంతోషం కలుగుతుండేదని చెప్పారు. ఎందుకంటే ఇది మామూలు విగ్రహం కాదని భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులు అందరూ తన రామయ్య విగ్రహం కోసం ఎదురు చూస్తున్నారని అనుకునప్పుడల్లా మనసు పులకరించిపోయేదని చెప్పారు.

బాలరాముడి విగ్రహం చెక్కేటప్పుడు ఒకలా ఉన్న శిల్పం… ప్రాణ ప్రతిష్ఠాపన తర్వాత మరోలా అనిపించిందని అన్నారు. ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత శిల్పం ముఖంలో చిరునవ్వు, కళ్లలో భావాలు ప్రత్యక్షమయ్యాయని యోగిరాజ్ వివరించారు. ఓ దశలో, ఇది నేను చేసిన విగ్రహమేనా అనే సందేహం కూడా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

allroudadda
allroudadda

దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, జనవరి 22న అయోధ్య ఆలయంలో బాలక్ రామ్ (రామ్ లల్లా) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన క్రతువు నిర్వహించారు. నవ్వుముఖంతో ఉన్న బాలరాముడి దివ్యస్వరూపాన్ని చూసేందుకు భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. లెక్కకు మిక్కిలిగా వస్తున్న రామ భక్తులను నియంత్రించడం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత ప్రయాసగా మారింది.

Leave a Reply