Chalaki Chanti : ఐసీయూలో జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి.. …! కారణం ఇదే.

కొన్ని రోజుల పాటు పలు కారణాల వల్ల జబర్ధస్త్ కామెడీ షోకు దూరంగా ఉన్న చంటి.. ఇటీవలే మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కేవలం జబర్ధస్త్ లోనే కాకుండా పలు రియాలిటీ షోస్ లోనూ పాల్గొని చంటి ప్రేక్షకులను అలరించారు. గతేడాది బిగ్‌బాస్ సీజ‌న్ సిక్స్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్న చంటి.. ఐదు వారాల పాటు హౌజ్‌లో కొన‌సాగించారు. ఆ తర్వాత చంటి గేమ్ స‌రిగా ఆడ‌లేక బ‌య‌ట‌కు వ‌చ్చిన విషయం తెలిసిందే.అయితే తాజాగా చలాకీ చంటి ఆరోగ్యానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

హటాత్తుగా వచ్చిన గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన చంటిని హైదరాబాద్ లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి అయిన గచ్చిబౌలి కేర్ కు షిప్టు చేసినట్లుగా చెబుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఐసీయూలో చేర్చారు.ఆయనకు వైద్యులు వైద్య సేవల్ని అందిస్తున్నారు. అయితే.. చలాకీ చంటి తాజా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.

అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.అయితే.. చంటికి సన్నిహితులుగా ఉండే వారు అందిస్తున్న సమాచారాన్ని చూస్తే.. కొద్ది రోజుల క్రితం చంటికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని.. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారని చెబుతున్నారు. తాజాగా ఈ నెల 21న మరోసారి గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు.

దీంతో అతడ్ని వెంటనే గచ్చిబౌలి కేర్ కు తీసుకెళ్లి జాయిన్ చేశారు. రక్త నాళాల్లో పూడికలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.దీంతో చంటికి సర్జరీ చేసి స్టంట్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉందని.. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి చంటి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు. అతడి తాజా ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ విడుదల కావాల్సి ఉంది.

Leave a Reply