Chandrababu Naidu | చంద్రబాబుకి బెయిలా.. జైలా.. కొనసాగుతున్న ఉత్కంఠ..?

Chandrababu Naidu | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రిమాండ్‌ రిపోర్ట్‌ పై ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తర్వాత న్యాయమూర్తి చంద్రబాబు వాంగ్మూలం తీసుకున్నారు. సీఐడీ (CID) తరపున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు.

Chandrababu Naidu
Chandrababu Naidu

ముందు చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్‌ లో పేర్కొనలేదు. కాసేపటి క్రితమే ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఏసీబీ కోర్టులో వాడీ వేడిగా వాదనలు కొనసాగుతున్నాయి.కాగా చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆయనకు నిద్రపోయే అవకాశం లేకుండా పోలీసులు వ్యవహరించారు. విశ్రాంతి లేకపోవడం… సుదీర్ఘ ప్రయాణం, విచారణ పేరుతో గంటల సమయం అటు ఇటు తిప్పటం పట్ల తెలుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  స్టార్ హీరోయిన్ రాశికి ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో తెలుసా ?

Chandrababu Naidu
Chandrababu Naidu

చంద్రబాబుకి బెయిలా.. జైలా..?

అధినేత చంద్రబాబును చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబును చూసేందుకు హాస్పిటల్, కోర్టు పరిసర ప్రాంతాలలో జనం పడిగాపులు గాస్తున్నారు.ఇంకా 2021 డిసెంబర్‌ 9 కంటే ముందు నేరం జరిగిందని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్‌ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ వాటాగా 371 కోట్ల రూపాయలు చెల్లించారని సీఐడీ తెలిపింది.

ఇది కూడా చదవండి:  నిజంగా గ్రేట్.. తాను చనిపోతూ ఏడుగురిలో వెలుగులు నింపింది!

సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్‌ రిపోర్ట్‌ సమర్పించింది. చంద్రబాబును 15 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ డిమాండ్‌ చేసింది. జైలా..బెయిలా.. సుమారు 40 గంటలుగా కొనసాగిన ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది.

Leave a Reply