Dangal Actress | తీవ్ర విషాదం 19 ఏళ్లకే ‘దంగల్’ నటి కన్నుమూత!

allroudadda

Dangal Actress | బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు సౌత్‌ సినీ ప్రేక్షకులను మెప్పించిన సూపర్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ మూవీ ‘దంగల్‌’. ఇండియాతో పాటు చైనాలో కూడా దంగల్ భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డ్‌ స్థాయి వసూళ్లను నమోదు చేసుకున్న విషయం తెల్సిందే.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఇప్పటికి కూడా దంగల్ రికార్డ్‌ ఉంది.

అలాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు దక్కింది. ఆ సినిమాలో అమీర్ ఖాన్ రెండో కూతురు బబితా ఫోగట్‌ గా నటించిన సుహానీ భట్నాగర్ కి మంచి గుర్తింపు వచ్చింది.బాల నటిగా దంగల్ లో నటించిన సుహానీ భట్నాగర్‌ ఈ మధ్య కాలంలో నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు.

allroudadda
allroudadda

బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సుహానికి కొంతకాలం క్రితం జరిగిన ప్రమాదంలో కాలు ప్రాక్చర్ అయ్యిందట. అందుకోసం వాడిన మందులు రియాక్షన్ కావడంతో బాడీ అంతా నీరు పట్టిందట. ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుహాని ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్‌లో ఉండగానే ఈరోజు చనిపోయారు. సుహానీ తన ఫ్యామిలీతో ఫరీదాబాద్ లో ఉంటున్నారు. ఆమె అంత్యక్రియలు సెక్టార్ 15 లోని అజ్రౌండా స్మశాన వాటికలో జరగనున్నాయని సమాచారం.

Recent Posts

Leave a Reply