Chandrababu Naidu | చంద్రబాబుకు బిగ్ షాక్.. ఇప్పట్లో బయటకు రాలేడు,

Chandrababu Naidu

Chandrababu Naidu | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చుక్కెదురైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. బాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. అదే సమయంలో సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను సైతం కోర్టు కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. రూ.300కోట్లకుపైగా స్కిల్‌ స్కామ్‌ వ్యవహారంలో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్నారు.

చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ కోర్టు.. రెండు పిటిషన్లను కొట్టివేస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. ఇదిలా ఉండగా.. ఫైబర్‌నెట్‌, ఇన్నర్‌రింగ్‌రోడ్‌, అంగుళ్లు కేసు వ్యవహారంలో బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై కీలక వాదనలు జరిగాయి.

Also Read : మధుప్రియపై మంత్రి మల్లారెడ్డి సీరియస్..! ఏం జరిగింది అంటే.. ?

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.తాజాగా ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. సుప్రీంలో సుదీర్ఘంగా సాగిన క్వాష్ పిటీషన్ పై తీర్పు రిజర్వ్ అయింది.అలాగా రేపటి నుండి దసరా సెలవలు కావడంతో బాబు బయటకు వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి నవంబర్ వరకు తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూడాల్సిన ఉంది.

Leave a Reply