Ram Gopal Varma | జగన్ కి పవన్ గురించి పెళ్లిళ్లు తప్ప ఇంకేం తెలియదా..

Ram Gopal Varma

Ram Gopal Varma | ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు చాలా వాడివేడిగా ఉన్నాయి. ఒకరిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటూ రాజ‌కీయం మ‌రింత హీటెక్కిస్తున్నారు. వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా, ఇక జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌ల‌లో ప‌వ‌న్ పెళ్లిళ్ల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా సామ‌ర్ల‌కోట‌లో జ‌రిగిన స‌భ‌లో ద‌త్తపుత్రుడు అంటూ పవన్ పైన పంచ్‌లు వేస్తూ ఆయ‌న‌ ఇల్లు హైదరాబాద్ లోనే ఉంటుందని..

కానీ, ఇల్లాలు మాత్రం ప్రతీ మూడేళ్లకు ఒకసారి మారిపోతారని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక సారి లోకల్..ఇంకోసారి నేషనల్..మరోసారి ఇంటర్నేషనల్ అంటూ ఎద్దేవా చేసారు.ఇక ఈ ద‌త్త‌పుత్రుడు ఏపీలో దోచుకోవటం..హైదరాబాద్ లో పంచుకోవటం అలవాటుగా మారింద‌ని విమ‌ర్శ‌లు చేసారు.దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో వ్యాపారానికి మాత్ర‌మే ఇక్క‌డికి వస్తాడని ముఖ్యమంత్రి మండిప‌డ్డారు. ప్యాకేజీ స్టార్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం తో సంబంధము లేదు..

Also Read | Belly Dance | యువకుడి బెల్లి డాన్స్ చూస్తే … మతి పోవాలిసిందే..!

పవన్ మూడు పెళ్లిళ్లపై జగన్

గాజువాక తో ఆయ‌నకి అనుబంధం లేదని సీఎం జ‌గ‌న్ అన్నారు.ఆ సంగతి కాసేపు పక్కన పెడితే తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ వ్యూహం ప్ర‌మోష‌న్‌లో భాగంగా నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లో జ‌గ‌న్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకు తెలియ‌దు. అయితే లోక‌ల్, నేష‌న్, ఇంట‌ర్నేషన‌ల్ అయితే క‌రెక్ట్ క‌దా.. మిగ‌తా కంటెక్ట్స్ తెలియ‌దు కాని, ఆయ‌న చేసుకున్న వారిలో తెలుగు అమ్మాయి, హిందీ అమ్మాయి, వేరే దేశానికి చెందిన అమ్మాయి ఉంది క‌దా అని వ‌ర్మ అన్నారు. ఆయ‌న కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

Leave a Reply