Nara Bhuvaneshwari | చంద్ర‌బాబుతో పెట్టుకోవద్దు జగన్.. చాలా ఇబ్బంది పడతావు.. చంద్ర‌బాబు భార్య ,

Nara Bhuvaneshwari | నంద్యాల నుంచి విజయవాడ తీసుకొచ్చి సీఐడీ అధికారులు శనివారం అర్థరాత్రి వరకు విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఉదయం 6 గంటలకు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు. పరిసరాలను మొత్తం పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.ఉదయం 6 గంటలకు ఏసీబీ కోర్టుకు చంద్రబాబును తీసుకెళ్లారు. ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా..

సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్ట్‌లో చంద్రబాబుపై సంచలన అభియోగాలు చేసింది సీఐడీ. స్కిల్‌ స్కాంలో చంద్రబాబే కీలక సూత్రధారి అని.. ఈ స్కాంపై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బులు రిలీజ్ అయ్యాయని రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: 

FIRలో చంద్రబాబు పేరు లేకపోవడంతో ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. రిమాండ్‌ రిపోర్ట్‌లో లోకేష్‌ పేరును కూడా సీఐడీ ప్రస్తావించింది. చంద్రబాబు పీఎ శ్రీనివాస్‌కు డబ్బులు అందాయని.. కిలారి రాజేశ్‌ ద్వారా లోకేష్‌కు డబ్బులు చేరాయని సీఐడీ స్పష్టం చేసింది.అది పక్కన పెడితే చంద్రబాబు అరెస్ట్ ను భార్య భువనేశ్వరి ఖండించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు.

Nara Bhuvaneshwari

అనంతరం తన సోదరుడు రామకృష్ణతో కలిసి మీడియాతో ఆమె మాట్లాడుతూ… యన పోరాటం ఆయన ఒక్కరి కోసమో, ఆయన కుటుంబం కోసమో కాదు. ఆయన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం. నేను ఒక్కటే కోరుతున్నా… మీ అందరి కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేయిచేయి కలపాలి. జై దుర్గాదేవి, జైహింద్, జై అమరావతి’ అని భువనేశ్వరి అన్నారు.అలాగే ప్రతి ఒక్కరికీ సామ్యం వస్తుంది అప్పుడు అందరికీ మేము కూడా సరైన సమాధానం చెప్తాము అన్నారు,

ఇది కూడా చదవండి: 

Leave a Reply