సూర్యవంశం’ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

వెంకటేష్ డబుల్ రోల్ ప్లే చేసిన సూపర్ హిట్ సినిమాల్లో ‘సూర్యవంశం’ ఒకటి. భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1998 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో చిన వెంకటేష్ కు కొడుకుగా, పెద్ద వెంకటేష్ కు మనవడుగా నటించిన బాలనటుడు అందరికీ గుర్తుండే ఉంటాడు. తన తండ్రికి రవ్వ లడ్డులు చేరవేస్తూ ఇతను పండించే కామెడీ భలే సరదాగా ఉంటుంది.

ఈ సినిమాలోనే కాదు ‘ప్రేమించుకుందాం రా’ ‘ప్రేయసి రావే’ , ‘మనసంతా నువ్వే’, ‘మావిడాకులు’, ‘బాల రామాయణం’, ‘ప్రియరాగాలు’, ‘నేనున్నాను’ ‘శ్రీమంజునాథ’ ‘తిరుమల తిరుపతి వెంకటేశ’ వంటి సినిమాల్లో కూడా ఇతను నటించి మెప్పించాడు.ఈ కుర్రాడి పేరు ఆనంద్ వర్ధన్. ఇప్పుడీ కుర్రాడు పెద్దోడు అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 20 కి పైగా సినిమాల్లో నటించిన ఆనంద్ చదువు రీత్యా సినిమాలకు దూరమయ్యాడు.

ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేశాడు.ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. హీరోగానే ఎంట్రీ ఇవ్వాలని ఇతను అనుకోవడం లేదు. కానీ ఎప్పటికైనా హీరోగా ఎదగాలని.. అందుకు ముందు నుండీ మంచి పాత్రలు ఎంపిక చేసుకోవాలని ఇతను భావిస్తున్నాడు. అందుకోసం ఆడిషన్లు ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడా డిజప్పాయింట్ అవ్వనని, ఇండస్ట్రీలో ఏదీ అసాధ్యం కాదని, తనకు మంచి పాత్ర దొరికే వరకు ప్రయత్నిస్తానని ఇతను తెలిపాడు. ఆనంద్ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Leave a Reply