Woman: తల్లి పరీక్ష రాస్తుండగా అమ్మగా మారిన మహిళా కానిస్టేబుల్..! ఏమి జరిగింది అంటే

సాధారణంగా పోలీసులపై ప్రజల్లో ఓ రకమైన భావన ఉంటుంది. విధుల్లో భాగంగా ప్రజలపై పోలీసులు కాఠిన్యం ప్రదర్శిస్తుంటారు. దీంతో పోలీసులకు మనస్సు ఉండదని, దారుణంగా ప్రవర్తిస్తారని చాలామంది అభిప్రాయ పడుతుంటారు. అయితే తాముపైకి మాత్రమే కాఠిన్యంగా ఉంటామని, తమకు మనస్సు ఉంటుందని పలు ఘటనలతో పోలీసులు చాటుకున్నారు. ఇటీవలే ఏపీ, తెలంగాణ రాష్ట్రలో జరిగిన కానిస్టేబుల్ పరీక్షల్లో మహిళ అభ్యర్థులు తమ బిడ్డలతో పరీక్ష కేంద్రానికి వచ్చారు.

వారి బిడ్డలను అక్కడే ఉన్న పోలీసుల చేరదీసి.. పరీక్ష పూర్తయ్యే వరకు చూసుకున్నారు. ఇలా అనేక సందర్భాల్లో పోలీసుల మంచి మనస్సు కనిపించింది. అలానే తాజాగా అహ్మదాబాద్ పరీక్షా స్థలం దగ్గర చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్థానికులు చూసి ఆ లేడీ కానిస్టేబుల్ ని ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం తెగ హల్ చల్ చేస్తుంది.

ఈ సంఘటన జులై 9న(ఆదివారం) చోటు చేసుకుంది. సరిగ్గా పరీక్ష రాసే సమయానికి శిశువు ఏడుపు మొదలు పెట్టింది. అదే సమయంలో ఏం చేయాలో నీ తల్లి కంగారు పడుతూ ఉంది. పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ డయాబెటి విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్లింది.

 అమ్మగా మారిన మహిళా

ఆ బిడ్డను ఎత్తుకొని లాలించింది.“మీరు వెళ్లి ధైర్యంగా పరీక్ష రాసి రండి. అంతవరకు మీ బిడ్డని చూసుకొనే బాధ్యత నాది” అని ధైర్యం చెప్పింది. తల్లిని పరీక్ష హాల్ లోకి పంపింది. ఆ పాపని ఎత్తుకొని లాలిస్తూ ఉండగా గుజరాత్ పోలీసులు ఈ సంఘటనని వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఆ లేడీ కానిస్టేబుల్ విధులు నిర్వహించడమే కాకుండా చిన్న పిల్లని లాలించే పని కూడా చేయడం గర్వకారణంగా ఉంది.

Leave a Reply