Dogs | మీ ఇంటి ముందు కుక్క ఏడిస్తే జరిగేది ఇదే..

Dogs | మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం.. వీధుల్లో కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా అరుస్తుంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటుంటారు. ఇంటి ముందు గానీ, వీధిలో గానీ కుక్కలు ఏడుస్తున్నట్లుగా అరిస్తే.. వాటిని అదిలించే ప్రయత్నం చేస్తుంటారు. కుక్క అలా అరవడం అపశకునం అని, చెడుకు సంకేతం అని మత విశ్వాసం. అయితే, వాస్తవానికి కుక్క ఏడుపు ఏం సూచిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏదైనా విపత్తు లేదా సంఘటన జరగడానికి ముందే కుక్కకు సిగ్నల్స్ అందుతాయట.

అందుకే కుక్క ఏడుస్తుందంటే ఏదో విపత్తు రాబోతుందని నమ్ముతారు. కుక్క అరవడం రాబోయే విపత్తును సూచిస్తుందని, ఎప్పుడైనా ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే, ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతోందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు పెద్దలు.ఇంకా కుక్క ఏడుపు దేనిని సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.మీ ఇంటి బయట లేదా తలుపు వద్ద కుక్క మొరిగితే ఇది ఏదో ఒక వ్యాధిని సూచిస్తుంది.మీ కుటుంబంలో ఎవరైనా పెద్ద అనారోగ్యంతో బాధపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

ఒక కుక్క రాత్రి ఏడుస్తున్నట్లు శబ్దం చేస్తే అది పెద్ద దురదృష్టాన్ని సూచిస్తుంది.అందుకే కుక్కను ఇంటి బయట ఏడవనివ్వకూడదు.కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.దీని వల్ల మీరు భారీగా నష్టపోతారు.ఏదైనా ఇంటి బయట కుక్క ఏడుస్తుంటే మీ ఇంటి చుట్టూ ప్రతికూల శక్తి ఉన్నట్లయితే కుక్కలు దాన్ని పసిగట్టి అరవడం మొదలుపెడతాయి.

అంతేకాకుండా రాహు కేతువులకు కారకుడు కుక్క.అందుకే కుక్క ఏడుపు రాహు కేతువు( Rahu Ketu )ల అశుభాన్ని సూచిస్తుంది.మీ ఇంటి బయట కుక్క ఏడుస్తున్నట్లయితే తరిమేయండి.కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించడం లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి.అవసరమైన వ్యక్తికి దానం చేయండి.ఎవరికి చెడు చెయ్యకూడదు.ఎవరి గురించి చెడు ఆలోచనలు మీ మనసులో ఉండకూడదు.

Leave a Reply