Lakshmi Devi | శుక్రవారం ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి..

Lakshmi Devi | లక్ష్మిదేవి క‌టాక్షం కోసం ఇలా చేయండి

  • శుక్రవారం లక్ష్మీదేవిని తామరపూల‌తో పూజించాలి. ఫ‌లితంగా లక్ష్మీదేవి అనుగ్రహం క‌లుగుతుంది.
  • లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, శుక్రవారాల్లో పంచదార మిఠాయి, పాయ‌సం నైవేద్యంగా సమర్పించండి.
  • శుక్రవారం ఇంటిని శుభ్రం చేయండి. ప్రధాన ద్వారం ముందు ముగ్గు వేసి లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించండి.
  • శుక్రవారాల్లో తామర మాల‌ లేదా స్ప‌టిక‌ మాలతో లక్ష్మీ మంత్రాలను జపించండి.

ధ‌న‌ లాభం కోసం
కొందరికి డబ్బు కొరత. ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిల‌వ‌దు. ఇందుకోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించి, కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. మీరు లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో చిటికెడు కుంకుమపువ్వును కలపాల‌ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ భ‌స్మాన్ని ఎరుపు రంగు కాగితంలో వేసి మీ పర్సులో భద్రంగా పెట్టుకోండి. ఇలా చేస్తే మీరు ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు.

సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం
శుక్రవారం లక్ష్మీదేవి, శుక్రుడికి అంకితం చేసిన‌ రోజు. శుక్రుడు స్త్రీలింగ గ్రహం. ప్రేమ, అందానికి సంబంధించిన గ్ర‌హంగా శుక్రుడిని ప‌రిగ‌ణిస్తారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, శుక్రవారం నాడు లక్ష్మీదేవితో పాటు శుక్రుడిని పూజించాలని నమ్ముతారు.

Leave a Reply