Mangalavaaram | మంగళవారం సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

Mangalavaaram

Mangalavaaram | డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ పై స్వాతిరెడ్డి, సురేష్ వర్మ ఈ సినిమాని నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై రిలీజ్ కి ముందు మంచి అంచనాలు నెలకొల్పారు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ నేడు నవంబర్ 17న రిలీజ్ అయింది.

కథ: గోదావరి ప్రాంతంలోని మహాలక్ష్మీపురం అనే గ్రామంలో 1996 ప్రాంతంలో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకుంటాయి. ఆ ఊరి అమ్మవారికి ఇష్టమైన మంగళవారం రోజున వరుసగా రెండు వారాలు ఇద్దరు (ఒక మహిళ, ఒక పురుషుడు) చొప్పున చనిపోతారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న జంట గురించి ముందు గోడల మీద పేర్లు రాయడం.. ఆ వెంటనే ఆ ఇద్దరు చనిపోవడం.. ఇలా వరుసగా రెండు వారాలు జరగడంతో ఊరంతా బెంబేలెత్తిపోతుంది.

ఊరివాళ్లు అవి ఆత్మహత్యలుగా భావించినప్పటికీ.. ఎస్ఐ మాయ (నందిత శ్వేత) మాత్రం హత్యలని బలంగా నమ్ముతుంది. కొంత కాలం కిందటే ఆ**త్మ హ**త్య చేసుకుని చనిపోయిన శైలజ (పాయల్ రాజ్ పుత్) దయ్యమై ఈ హ**త్య లు చేస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. మరి ఈ హ**త్య లతో నిజంగా శైలజకు సంబంధముందా.. ఈ మిస్టరీని మాయ ఎలా ఛేదించింది అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు:

పాత్రలో పాయల్ ఎంతో అద్భుతంగా నటించారు.ఈమె తన నటన ద్వారా అందరిని మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు.మిగిలిన నటీనటులందరూ కూడా వారి పాత్రలకు పూర్తిగా జీవం పోసారని చెప్పాలి.నందిత శ్వేత కొంచెం కటువుగా సాగే ఎస్ఐ పాత్రలో ఓకే అనిపించింది.ష్ణచైతన్య తక్కువ నిడివిలోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రియదర్శి పాత్ర ఆశ్చర్యపరుస్తుంది. అతన కూడా తక్కువ స్క్రీన్ టైంలోనే తన ప్రభావాన్ని చూపించాడు.

చాలా వరకు సీరియస్ గా సాగే సినిమాలో అజయ్ ఘోష్ అక్కడక్కడా నవ్వులతో రిలీఫ్ ఇచ్చాడు. తన అసిస్టెంట్ పాత్రలో చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. మలయాళ నటి రియా పిళ్లై పాత్ర.. నటన బావున్నాయి. రవీంద్ర విజయ్ కూడా బాగా చేశాడు.అజనీష్ లోక్ నాథ్ ఈ తరహా మిస్టిక్ థ్రిల్లర్లకు సంగీతాన్నందించడంలో ఆరితేరిపోయాడు.. కెమెరామన్ శివేంద్ర దాశరథి కథకు అవసరమైన విజువల్స్ అందించాడు.దర్శకుడు అజయ్ భూపతికి ఈ సినిమా కచ్చితంగా మంచి కమ్ బ్యాక్.

చివరగా: మంగళవారం.. బో ల్డ్ అండ్ థ్రిల్లింగ్

రేటింగ్-2.75/5

Leave a Reply