YS Sharmila | మా అన్న సహా వైకాపాకు ఓటెయ్యకండి.. షర్మిల షాకింగ్ కామెంట్స్.

allroudadda

YS Sharmila | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అన్న తీరు వల్లే వైఎస్ఆర్ ఫ్యామిలీ చీలిపోయిందని చెప్పారు. గురువారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆమె… సోదరుడు, సీఎం జగన్ ను నేరుగా టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక… జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయారని చెప్పారు.”కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, తమ కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ ఆన్న గారు.

నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు,జగన్ ఆన్న గారే కారణం. ఇవాళ మా కుటుంబం చీలిందంటే అది చేతులారా చేసుకున్నది జగన్ ఆన్న గారే. దీనికి సాక్ష్యం దేవుడు…దీనికి సాక్ష్యం నా తల్లి,వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం” అని వైఎస్ షర్మిల అన్నారు.వైఎస్ఆర్ కి ఈ గడ్డ అంటే ఎంతో ప్రేమని, జీవించినంతకాలం ఇక్కడి ప్రజల కోసమే జీవించారన్నారు. తాను ఉన్నంతకాలం ఇక్కడి ప్రజలకు సేవ చేశారన్నారు. వివేకానంద రెడ్డి సైతం ఇక్కడి ప్రజలకు సేవ చేవారన్నారు. – వైఎస్ఆర్,వివేకా వంటి నాయకులు మళ్లీ దొరకడం కష్టమన్నారు.

allroudadda
allroudadda

తన బాబాయి వివేకానంద రెడ్డి గొడ్డలి పోట్లకు బలయ్యారన్నారు. వివేకానంద రెడ్డి చనిపోయి ఐదేళ్లయినా ఇంత వరకు హంతకులకు శిక్ష పడలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా ఆత్మ ఇవాల్టికీ ఘోషిస్తుందన్నారు. హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని చెప్పడానికి ఆధారాలున్నా..ఇప్పటివరకు శిక్ష పడలేదని స్వయంగా సీఎం జగన్ హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు.అధికారం అడ్డుపెట్టుకొని దోషులను కాపాడుతున్నారన్నారు. హంతకులను కాపాడటానికా ప్రజలు అధికారం ఇచ్చిందంటూ ప్రశ్నించారు.

Roja Selvamani | కాస్త నల్లగా ఉన్నాను అని నువ్వు ఏం హీరోయిన్ అన్నారు..

ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలు కి పోలేదని, హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నారని షర్మిల విమర్శించారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే వైఎస్ఆర్ బిడ్డ ఇక్కడి నుంచి పోటీ చేస్తోందన్నారు. అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీగా నిలబడ్డానని, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ ..మరోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారని.. ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని ఆమె కోరారు.ప్రచారంలో సునీత కూడా ప్రసంగించారు. ఎంపీగా గెలిచిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, ప్రజల కోసం పనిచేయకుండా ఎక్కడ తిరుగుతున్నారని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. కడప జిల్లా ప్రజలు న్యాయం వైపు ఉన్నామా.. అన్యాయం వైపు ఉన్నామా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాన్నారు.

Recent Posts

Leave a Reply