Success Story | బస్సులో చదివి 8 బంగారు పతకాలు సాదించిన యువతి.

Success Story

Success Story | మన జీవితంలో కొంతమంది నిజ జీవిత కథలు విన్న సమయంలో కెరీర్ లో సక్సెస్ సాధించడం కోసం ఇంతలా కష్టపడతారా అనే సందేహం తలెత్తుతుంది.వినుత( Vinutha ) అనే యువతి సక్సెస్ స్టోరీ వింటే మనకు కూడా ఇలాంటి సందేహం కలుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.రోజుకు ఆరు గంటలు ప్రయాణం చేసి బస్సులో చదివి 8 బంగారు పతకాలు సాధించడం సులువైన విషయం కాదు.

నాలా భద్రత లేని ఉద్యోగం నీకొద్దంటూ తండ్రి చెప్పిన మాటలు మనస్సులో నింపుకున్న వినుత ప్రభుత్వ కొలువే లక్ష్యంగా( Govt Job ) ఎంతో కష్టపడి చదివి యూనివర్సిటీ టాపర్ గా నిలవడంతో పాటు బంగారు పతకాలను సైతం అందుకున్నారు.వినుత తల్లి పేరు చంద్రిక కాగా తండ్రి జయరాం సర్వేయర్ డిపార్టుమెంట్ లో హెల్పర్ గా పని చేస్తున్నారు.

వినుత తల్లి, తండ్రి పదో తరగతి వరకు మాత్రమే చదివారు.వినుత తండ్రి ఆమెతో ఎప్పుడూ నాది భద్రత లేని ఉద్యోగమని నువ్వైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చెప్పేవారు.పది, ఇంటర్ లో 90 శాతం మార్కులు సాధించిన వినుత హాస్టల్ లో ఉండటానికి డబ్బులు లేక సొంతూరు అనేకల్ నుంచి బస్సులో రోజుకు ఆరు గంటలు ప్రయాణం చేసి చదివారు.మూడు బస్సులు మారి బస్సులోనే చదువుకుంటూ కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు.

డిగ్రీ పూర్తైన తర్వాత పీజీకి బెంగళూరు యూనివర్సిటీలో ఆమెకు సీటొచ్చింది.ఆ యూనివర్సిటీకి వెళ్లి రావడానికి ఆమెకు ఎనిమిది గంటల సమయం పట్టేది.బరువైన పుస్తకాలను మోస్తూ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వినుత ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.బంగారు పతకాలతో పాటు నగదు బహుమతులను సైతం వినుత సొంతం చేసుకున్నారు.ఆమె ఏకంగా ముడు నగదు బహుమతులు సొంతం చేసుకున్నారు.నాన్న కోసం ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆ తర్వాత పీహెచ్డీపై దృష్టి పెడతానని అమె తెలిపారు.

Leave a Reply