Kumari Aunty | చదువు రాదు అయిన కోట్లు సంపాదించాను.. కుమారి ఆంటీ ఎమోషనల్ కామెంట్స్..

allroudadda

Kumari Aunty | ఈ మధ్య కాలంలో తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న కుమారి ఆంటీకి( Kumari Aunty ) బిజినెస్ సైతం ఊహించని స్థాయిలో జరుగుతోంది.రోజుకు 5000 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు లాభం మిగులుతుందని కుమారి ఆంటీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.యూట్యూబ్ షార్ట్స్ వల్ల ఆమె పేరు సోషల్ మీడియా వేదికగా ఎంతగానో మారుమ్రోగింది.చేసే పనులను ఆత్మవిశ్వాసంతో చేయాలని ఆత్మవిశ్వాసం ముందుంటే విజయం సాధించవచ్చని కుమారి ఆంటీ తెలిపారు.

చదువు లేదని బాధ పడవద్దని భక్తి, ముక్తికి చదువులెందుకని ఆమె కామెంట్లు చేశారు. ఆత్మశాంతి ఉంటే చాలని అదే దైవమని కుమారి ఆంటీ పేర్కొన్నారు.ఆత్మవిశ్వాసంతో పని చేస్తూ ముందడుగులు వేస్తే మంచి జరుగుతుందని మా పెద్దలు చెప్పారని ఆమె పేర్కొన్నారు. పెద్దల మాట వింటే ఇప్పటికీ సక్సెస్ దక్కుతుందని కుమారి ఆంటీ చెప్పుకొచ్చారు. పెద్దల మాట వింటే విజయమే తప్ప ఫెయిల్యూర్ ఉండదని ఆమె అన్నారు.

allroudadda
allroudadda

కుమారి ఆంటీ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా కుమారి ఆంటీ సింపుల్ గా ఉండటానికే ఇష్టపడుతున్నారు.కుమారి ఆంటీ (Kumari Aunty) అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కుమారి ఆంటీకి టీవీ షోలలో ఎక్కువగానే ఆఫర్లు వస్తున్నాయి. భవిష్యత్తులో సామాన్యుల కేటగిరీలో కుమారి ఆంటీ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కుమారి ఆంటీని అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Leave a Reply