Lakshmika | ఇండస్ట్రీలో విషాదం… 25ఏళ్లకే గుండెపోటుతో స్టార్ హీరోయిన్ మృతి.

Lakshmika

Lakshmika | సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను మరింత కలవరపరుస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య కారణంగా చనిపోతున్నారు.. ఇప్పుడు అతి చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా ఒక నటి మరణించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇలా చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్నారు.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.తాజాగా మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మరో యంగ్ హీరోయిన్ గుండెపోటుతో మృతి చెందడం సెన్సేషన్ సృష్టిస్తోంది.. హీరోయిన్ లక్ష్మీకా సజీవన్ Lakshmika Sajeevan గుండెపోటుతో మృతి చెందింది.

Lakshmika
Lakshmika

ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఓ పోస్ట్

అజు అజీష్ దర్శకత్వం వహించిన కాక్క అనే షార్ట్ ఫిల్మ్‌ తో సినీ కెరీర్ ను మొదలుపెట్టింది. పంచమి అనే పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ తరువాత ఆమె పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

Also Read : జగ్గు బాయ్ లో ఈకోణం కూడా ఉందా..

లక్ష్మిక సజీవన్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా నివాళి తెలియజేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టులు చేస్తున్నారు.లక్ష్మిక ఆరు రోజుల క్రితమే తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఓ పోస్ట్ చేశారు. సూర్యుడు ఉదయిస్తున్న ఫొటోను దుబాయ్ నుంచే షేర్ చేశారు. “నమ్మకం. చీకటి ఉన్నప్పటికీ వెలుగు కూడా వస్తుంది” అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ పెట్టి వారం తిరగకుండానే ఆమె కన్నుమూశారు.

Leave a Reply