Bigg Boss 7 | బిగ్‌బాస్‌ విన్నర్‌ రైతుబిడ్డ.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా..!

Bigg Boss 7

Bigg Boss 7 | బిగ్‌బాస్ ఎక్కడో ఇంగ్లీష్ దేశంలో ప్రారంభమైన ఈ రియాల్టీ షో.. ఆ తర్వాత హిందీ సహా మిగతా ప్రాంతీయ భాషల్లో సక్సెస్ అయింది. అటు తెలుగులో కూడా ఈ షోకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక తెలుగు ఆడియన్స్ బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 7 (Bigg Boss 7 Telugu) పూర్తయింది. 15 వారాలుగా సాగిన ఈ బిగ్‌బాస్ నిన్న ఆదివారం రాత్రి పూర్తయింది. 14 మందితో మొదలైన బిగ్‌బాస్ కొంతమంది ఎలిమినేట్ అయిన తర్వాత మరో అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు.

ఒక్కో వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయగా ఫైనల్ కి ఆరుగురిని మిగిల్చారు. అర్జున్, ప్రియాంక జైన్, యావర్, శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ లు ఫైనల్ కి వెళ్లారు.ఇక ఫినాలే ఎపిసోడ్ లో మొదటిగా అర్జున్ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశాడు. ఆ తరువాత ఫైనల్స్ లో నిలిచి ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక.. సెకండ్ ఎలిమినేషన్ గా ఫైనల్ రేసులో అవుట్ అయ్యింది. ఆ తరువాత యావర్ సెల్ఫ్ ఎలిమినేషన్ తో బయటకి వచ్చేశాడు. 15 లక్షల సూట్ కేసు కావాలా..? టైటిల్ కావాలా..? అని ఆఫర్ ఇవ్వగా.. యావర్ సూట్ కేసుతో ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశాడు.

Bigg Boss 7
Bigg Boss 7

Bigg Boss 7 | సింపతీతో ఫాలోవర్స్ తెచ్చుకున్న ప్రశాంత్

దీంతో ఫైనల్ త్రీలో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్ మిగిలారు.ముందు నుంచి రైతు బిడ్డ అని పొలాల్లో వీడియోలు తీసుకుంటూ సింపతీతో ఫాలోవర్స్ తెచ్చుకున్న ప్రశాంత్ (Pallavi Prashanth) నన్ను బిగ్ బాస్ కి తీసుకెళ్లండి అని ఓ సంవత్సరం పాటు వీడియోలు చేసి మొత్తానికి హౌస్ లో చోటు సంపాదించాడు. ఇక హౌస్ లో కూడా రైతు బిడ్డ, రైతు బాధలు అని సింపతీతో పాపులర్ అయి విన్నింగ్ వరకు వచ్చాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు.

బిగ్‌బాస్ విజేతకు 50 లక్షలు అని ప్రకటించినా దాంట్లో 15 లక్షలు ఓ కంటెస్టెంట్ ని బయటకి పంపడానికి తీశారు. ఆ డబ్బులు యావర్ తీసుకొని వెళ్ళిపోయాడు. దీంతో విన్నింగ్ అమౌంట్ 35 లక్షలు అందుకున్నాడు ప్రశాంత్. దీంతో పాటు అతని రెమ్యునరేషన్ 15 వారాలకు 15 లక్షలు అని సమాచారం. అలాగే వీటితో పాటు ఓ మారుతి బ్రేజా కార్, ఓ డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకున్నాడు. అయితే మొత్తం బిగ్‌బాస్ నుంచి రెమ్యునరేషన్, ప్రైజ్ మనీ కలిపి ఇతను సంపాదించిన 50 లక్షల్లో దాదాపు 15 లక్షలు ట్యాక్స్ పోతుంది. అంటే చివరికి ప్రశాంత్ చేతికి 35 లక్షలు మిగులుతుంది.

Leave a Reply