Sai Pallavi | రామాయణ కోసం సాయిపల్లవి పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా.?

Sai Pallavi | బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కనిపిస్తారు. రావణుడి పాత్ర కోసం యష్ (Yash)ని తీసుకున్నారు. సీత పాత్రలో సాయిపల్లవి (Sai Pallavi) కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

ఇటివలే సాయి పల్లవి లుక్ టెస్ట్ లో పాల్గొన్నారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమా కోసం సాయి పల్లవి బల్క్ డేట్స్ కేటాయించారని తెలుస్తోంది.ఈ క్రమంలో రామాయణ సినిమాకు సంబంధించి సాయి పల్లవి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా కోసం ఈ బ్యూటీ బాగానే డిమాండ్ చేసిందట.

Sai Pallavi

సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి రామాయణ కోసం ఏకంగా 15 కోట్లు తీసుకుంటుంది అని టాక్.రామాయణ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తుండటంతో.. సాయిపల్లవి.. 3 పార్ట్స్ కి కలిపి రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పారితోషికం విషయంలో సాయి పల్లవి.. నయనతారని దాటేసి రికార్డ్ సృష్టించినట్లే. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్టానే తన పారితోషికాన్ని సాయిపల్లవి అమాంతం పెంచేసిందని అంటున్నారు.

Recent Posts

Leave a Reply