Moola Nakshatra: ఆన‌క్ష‌త్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే క‌ష్టాలు వస్తాయా?

అంతరిక్షమండలంలో నక్షత్రాల సమూహానికి ప్రత్యేక స్థానముంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ విధంగా 27 నక్షత్రరాశులగా విభజించబడింది. వీటి ప్రాథమిక స్వభావం విభిన్నంగా ఉంటంది. విభిన్న ఫలితాలను ఇస్తుంది. కొన్ని నక్షత్ర రాశులు మృదువైనవి. కొన్ని కఠినమైనవి. వీటిలో మూల నక్షత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నక్షత్రరాశుల్లో ఇది 19వ స్థానంలో ఉంది.

నిజానికి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేయాలంటే తప్పనిసరిగా అమ్మాయి అబ్బాయి జాతకాలు చూస్తారు అవి కలిస్తే మాత్రమే పెళ్లి చేస్తారు అయితే చాలామంది చెప్పే విషయం మూలా నక్షత్రం లో పుట్టిన అమ్మాయిని పెళ్ళి చేసుకోకూడదని అంటూ ఉంటారు ఒకవేళ చేస్తే అనేక రకాల ఇబ్బందులు సమస్యలు వస్తాయనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే శాస్త్రపరంగా చూసుకున్నట్లయితే కనుక మూలా నక్షత్రం లో పుట్టిన స్త్రీ పురుషుణ్ణి వివాహం చేసుకున్న౦త మాత్రాన ఎలాంటి నష్టం జరగదని పైగా వారిరువురికి అదృష్టం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కారణంగా ఎలాంటి నష్టం జరగదు కానీ కొంతమంది నష్టం జరుగుతుంది అనుకుంటే కనుక ఆమె కుటుంబంలో ముందే జరిగి ఉండాలి కదా కేవలం పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే నష్టాలు జరుగుతాయా అనేవి కూడా నిపుణులు చెబుతున్నారు. చాలామంది నక్షత్రంలో పుట్టిన స్త్రీలు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారండి పెళ్లిళ్లు సైతం కూడా అంగరంగ వైభవంగా చేసుకున్నారని ఇలా పుట్టినంత మాత్రాన ఎలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.

కేవలం కొంతమంది వాళ్ల భుక్తికోసం ఇలాంటి తప్పు మాటలు చెబుతున్నారే కానీ దీనిలో ఎలాంటి నిజం లేదని మొత్తంగా 27 నక్షత్రాలు ఉన్నాయని కేవలం మూల, ఆరుద్ర, జేష్ట నక్షత్రాలు కలిగిన వారిని పెళ్లి చేసుకుంటే మాత్రమే నష్టపోతారని ప్రచారం చేస్తున్నారని దీనిలో ఏమాత్రం నిజం లేదంటూ చెప్పడం జరుగుతుంది. కష్టపడి పని చేస్తే ఏ నక్షత్రంలో పుట్టిన ఉన్నత స్థాయికి చేరుకుంటారని దానిలో ఎలాంటి అనుమానం లేదని. ఎలాంటి నక్షత్రంలో పుట్టిన ప్రశాంతంగా పెళ్లి చేసుకోవచ్చని ఎలాంటి ఇబ్బందులు రావని చెబుతున్నారు.

Leave a Reply