Nayanthara | నయనతార వాచ్ ఖరీదు ఎంతో  తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 

Nayanthara | సాధారణంగా ఏ హీరోయిన్ల కైనా సరే సినీ కెరియర్ చాలా తక్కువగా ఉంటుంది. మహా అయితే 10 15 ఏళ్ల వరకు వారి సినీ కెరియర్ సాఫీగా సాగడం కష్టం అని చెప్పాలి. అటువంటిది 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీని నయనతార ఏళ్లుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తుంది ఈ హీరోయిన్. ఒక్కో సినిమాకి కోట్లు వసూలు చేస్తూ స్టార్ హీరోయిన్గా వెలిగిపోతుంది. తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా

భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న బిజీగా ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్ చిరంజీవి బాలయ్య వంటి సీనియర్ హీరోలతో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే నయనతార రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంటుంది అని చెప్పొచ్చు. 40 వయస్సు దాటినప్పటికీ ఇప్పటికీ నయనతార అదే జోష్ తో దూసుకుపోతోంది. అయితే ఇటీవలే చెన్నైలో డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార లిలక్ షేడ్ చీరలో అందంగా కనిపించింది. సిల్వర్ నెక్ పీస్, ఝుంకాలతో మరింత అందంగా కనిపించింది.

Actress Pragathi | బుల్లెట్ పై రచ్చ రచ్చ చేసిన ప్రగతి ఆంటీ

ఎంతో సింపుల్ గా.. అద్భుతంగా కనిపించారు నయన్, విఘ్నేశ్. రిసెప్షన్ కంటే ముందు వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది నయన్. అందులో ఆమె ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.ఆమె చీరకు సరిగ్గా సరిపోయే విలాసవంతమైన రోలెక్స్ ఓస్టెర్ పర్పెచ్యువల్ 36 ధరించింది. ఇది సొగసైన మన్నికైన వాచ్ లకు ప్రసిద్ధి. ఇది ఇతర మోడల్‌ల నుండి వేరుగా ఉంటుంది. నయన్ ధరించిన వాచ్ ధర రూ. 5.3 లక్షలు.గతంలో 2023లో నయన్ నటించిన అన్నపూర్ణి ప్రీమియర్ సమయంలో రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచువల్‌ వాచ్ ధరించింది. ఈ వాచ్ ఖరీదు రూ. 5.5 లక్షలు. నయనతార టెస్ట్ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసింది. దీనిపై మీ ఆభిప్రాయం కామెంట్ లో రాయండి.

Leave a Reply