Actress Pragathi | బుల్లెట్ పై రచ్చ రచ్చ చేసిన ప్రగతి ఆంటీ

Actress Pragathi

Actress Pragathi | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో తల్లి పిన్ని అత్త పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రగతి ( Pragathi) ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే కరోనా సమయంలో మాత్రం ఈమె సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు .

నిత్యం ఎన్నో రకాల డాన్స్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈ మధ్యకాలంలో ప్రగతి ఎక్కువగా జిమ్( Gym )లోనే గడుపుతూ ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఈమె జిమ్ లో భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ ఉంటారు.ఇలా వర్కౌట్స్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఇక వెయిట్ లిఫ్టింగ్( Weight Lifting ) భాగంగా చీర కట్టులో కూడా ఎంతో బరువులను ఎత్తుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

Actress Pragathi

ఇలా నాలుగు పదుల వయసులో కూడా ఫిట్నెస్ పై చాలా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ఈమె తాజాగా బుల్లెట్ బైక్ నడుపుడుతున్న వీడియో ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.గల్లీ లో బైక్ పై చక్కర్లు కొట్టింది. షర్ట్ లేకుండా కేవలం ఇన్నర్ వేర్ ధరించి రౌడీలా బైక్ నడిపింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సదరు వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు.

Recent Posts

Leave a Reply