Paritala – kalyan | అసలు పవన్ కళ్యాణ్ కి, పరిటాల రవికి మధ్య జరిగిన గొడవేంటి ?

allroudadda

Paritala – kalyan | నిజానికి ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పరిటాల రవి. తెలుగుదేశం హయాంలో రాయలసీమను శాసించిన నేత. తన రాజకీయ ఎదుగుదల కోసం ఎన్టీఆర్ పరిటాల రవిని వెలుగులోకి తెచ్చి పెంచి పోషించారనే వాదన ఉంది. దాదాపు రెండు దశాబ్దాలు పరిటాల రవి హవా నడిచింది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పరిటాల రవి గెలిచాడు.మంత్రి పదవులు అలంకరించాడు. ఎన్టీఆర్ కి… ఆయన కన్నుమూశాక నారా చంద్రబాబు నాయుడికి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు.

పార్టీలో పరిటాల రవికి ఎక్కడలేని ప్రాధాన్యత ఉండేది. ఆయన కోరుకుంది ఏదైనా దక్కాల్సిందే. అనంతపురం టు హైదరాబాద్ మొత్తం పరిటాల సామ్రాజ్యమే. సెటిల్మెంట్స్, దందాలు వెరీ కామన్. ఈ క్రమంలో పరిటాల రవి హైదరాబాద్ లో చిరంజీవికి చెందిన ఒక ఖరీదైన భూమిని కబ్జా చేశాడు. ప్రశ్నించిన చిరంజీవిని పరిటాల అవమానించి పంపాడు. నీకు దిక్కున్న చోట చెప్పుకో పో అన్నాడు.అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం.

allroudadda
allroudadda

ఆయన ప్రభుత్వంలో పరిటాల మంత్రి. చేసేది లేక చిరంజీవి గమ్మన ఉండిపోయారు. అన్నయ్యకు జరిగిన అవమానానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోయాడు. నేరుగా పరిటాల ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. పరిటాల రవి అహం దెబ్బతినడంతో పవన్ ని కిడ్నాప్ చేశాడు. అనంతపురం తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేశాడు. గుండు చేసి అవమానపరిచాడు. చిరంజీవి టీడీపీ పెద్దలను ప్రాధేయపడడంతో పవన్ కళ్యాణ్ ని వదిలిపెట్టాడు… ఇది ప్రచారంలో ఉన్న కథనం.

ఖుషి మూవీ విడుదల తర్వాత ఈ పరిణామం జరిగినట్లు కొందరి వాదన. ఈ కారణంగానే పవన్ రెండేళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యాడు. ఆయన అవమానంతో బయటకు రాలేదంటారు. అప్పట్లో కొన్ని పత్రికలు చిరు-పరిటాల భూవివాదం గురించి, పవన్ కళ్యాణ్ కిడ్నాప్ గురించి రాశాయి.జనాలు ఆ విషయం మర్చిపోయారు. అయితే యాంటీ ఫ్యాన్స్ అప్పుడప్పుడు ఈ కోణంలో పవన్ ని అవమానించే ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్ధులు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. టీడీపీ నేత ఆయనను అవమానిస్తే వాళ్ళతోనే చేతులు కలిపాడని వైసీపీ వర్గాలు ఎద్దేవా చేస్తూ ఉంటాయి.

పవన్ ఒకటి రెండు బహిరంగ సభల్లో దీన్ని ఖండించారు. నిజంగా ఈ సంఘటన జరిగిందా అనే సందేహం జనాల్లో ఉంది. దానికి పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఇవన్నీ అపోహలుగా కొట్టిపారేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఆయన ఎదుగుదలను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని, కింద పరిచేందుకు చేసే కామెంట్స్ మాత్రమే అన్నారు. పవన్ కళ్యాణ్ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అవన్నీ నిరాధార ఆరోపణలు మాత్రమే, అని తాజాఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు ఆపేయాలని కోరుతున్నారు. పరిటాల శ్రీరామ్ చెప్పిన ఈ మాటలకు సంబంధించిన వీడియో పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Leave a Reply