Chiranjeevi Fair | చిరంజీవిని ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు, అసలు ఏం జరిగిందంటే..?

Chiranjeevi Fair | 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు చిరంజీవి . తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. అయితే బాబీ మాట్లాడుతూ .. ” మెగా అన్నయ్యకి ఆవేశం రాదని చాలామంది అంటున్నారు.

కానీ ఆయనకి ఆవేశం వస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో నాకు తెలుసు. ఒకసారి పవన్ కల్యాణ్ గారి ఒక సినిమా షూటింగు ఒక ప్రైవేట్ హౌస్ లో జరుగుతోంది. అక్కడ పనిచేస్తున్న కుర్రాళ్లు చెప్పులు వేసుకుని తిరుగుతున్నారని ఆ ఇంటి ఓనర్ ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం మొదలుపెట్టాడు. దాంతో కల్యాణ్ గారికి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ విషయం తెలిసి ఆ ఇంటి ఓనర్ కి చిరంజీవి గారు కాల్ చేశారు. “నా తమ్ముడిని బయటికి వెళ్లమనడానికి నువ్వెవడివిరా .. నీ ఇల్లెంతా? సినిమా షూటింగు ఎలా జరుగుతుందో తెలిసే కదా ఇచ్చావు. ఇంటిమీద ప్రేమ ఉంటే తాళం వేసుకో. అంతేగానీ .. డబ్బులు తీసుకుని షూటింగుకి ఇచ్చి ఇలా మాట్లాడటం కరెక్టు కాదు .. విషయం నాకు ఆలస్యంగా తెలిసింది.కాస్త ముందు తెలిసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది” అంటూ వార్నింగ్ ఇచ్చారు. తనని ఏమన్నా అన్నయ్య పట్టించుకోరుగానీ, తన తమ్ముడిని .. తమ్ముళ్ల వంటి అభిమానులను ఎవరేమన్నా ఒప్పుకోరు” అంటూ చెప్పుకొచ్చాడు.

Recent Posts

Leave a Reply