Samantha:సమంతకి గుడి కట్టిన అభిమానిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. సమంత నటి మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా. మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన సామ్‌కు పేదల కష్టాలు చాలా బాగా తెలుసు. అందుకే సమంత పలు సేవాకార్యక్రమాల ద్వారా పేదలకు సాయం చేస్తుంటుంది. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లను చేయించి పెద్ద మనసు చాటుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో సందీప్ అనే వీరాభిమాని సమంత కోసం ఏకంగా ఓ గుడిని కట్టేశాడు.బాపట్ల జిల్లా చండూరు మండలం అలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని. ఆమె సినిమాలను చూస్తూ సమంతకు ఫ్యాన్‌గా మారిన సందీప్, ఆమె చేసే సామాజిక సేవతో వీరాభిమానిగా మారాడు. ప్రత్యూష ఫౌండేషన్ తరపున సమంత చేస్తున్న సేవలతో ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి.

దీంతో సమంతపై సందీప్‌కు మరింత అభిమానం పెరిగింది. ఈ క్రమంలోనే సమంతకు ఓ గుడి కట్టించాలని రెండేళ్ల కిందటే ఈ అభిమాని నిర్ణయం తీసుకుని.. ఎట్టకేలకు నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆ గుడిని ప్రారంభించాడు. తన ఇంటి ఆవరణలో ఓ చిన్న గుడి కట్టి సమంత విగ్రహాన్ని అందులో పెట్టాడు.ఇలా సినీ తారల పట్ల సందీప్ చూపించినటువంటి అభిమానంపై కొందరు ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఎంతోమంది అభిమానించే సమంతను తాను కూడా అభిమానిస్తూ తన కోసం ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి గుడి కట్టించారు అయితే ఈ ప్రేమ కాస్త సమంత పై కాకుండా తల్లిదండ్రులపై కనుక చూపించి ఉంటే ఎంతో గొప్పవాడిగా చరిత్రలో మిగిలిపోయే వాడివని పలువురు కామెంట్ చేస్తున్నారు. నిన్ను కన్న తల్లిదండ్రులకు గుడి కట్టి నీ రుణాన్ని తీర్చుకొని ఉంటే బాగుండేదని సమంత పై అభిమానంతో కాకుండా తల్లిదండ్రులపై ప్రేమతో ఆ పని చేసి ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.దీనిపై మీ ఆభిప్రాయం కామెంట్ లో తెలియచెయ్యండి,

Leave a Reply