Neha Sharma | హద్దులు మీరిన ‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Neha Sharma | రాంచరణ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘చిరుత’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన బీహార్ భామ నేహాశర్మ.. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ మూవీలో ఈ అమ్మడు చాలా చక్కగా నటించింది.

లేడీ విలన్ స్థాయిలో రెచ్చిపోయింది. మొదటి సినిమా హిట్ అయిన వెంటనే ఈ అమ్మడికి వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. ఆ టైంకి వరుణ్ సందేశ్ ఫామ్లో ఉన్నాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోయేసరికి ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి.

దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది.అక్కడ ‘క్రూక్’ ‘తేరి మేరీ కహాని’ వంటి సినిమాల్లో నటించింది కానీ అక్కడ కూడా ఈమె సక్సెస్ కాలేదు.తర్వాత తమిళ్, పంజాబీ సినిమాల్లో కూడా నటించినా లాభం లేకపోయింది. ప్రస్తుతం ఈమె ఆఫర్ల కోసం సోషల్ మీడియానే నమ్ముకుంది. అక్కడ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ కు మంచి కిక్ ఇస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Leave a Reply