Temple | అప్పులు అలాగే దరిద్రాన్ని దూరం చేసే దేవాలయం.. ఎక్కడ అంటే..?

Temple | దాదాపు ప్రతీ మనిషికి వారి వారి స్థాయిలకు తగిన అప్పులుంటాయి. పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు కూడా వారికి తగినట్లుగా అప్పులు ఉంటాయి. అంటే బ్యాంకులను నుంచి తెచ్చుకునే లోన్లు వంటివి. అయితే అప్పులు లేని సామాన్యులు ఉండరు అంటే అతిశయోక్తికాదు. అప్పుల బాధలతో అల్లాడిపోయేవారు ఈ ‘రుణ’బాధలనుంచి ఎప్పుడు గట్టెక్కుతామురా దేవుడా అనుకుంటు కనిపించని దేవుడిని వేడుకుంటారు. అప్పుల తీర్చుకోవటానికి నానా పాట్లు పడుతుంటారు. అటువంటి ‘అప్పుల బాధితులకు’ ఆపద్భాందవుడుగా వెలుగొందుతున్నాడు శ్రీ వేంకటేశ్వరస్వామి.

సాక్షాత్తు లక్ష్మీదేవే భార్యగా ఉన్న వెంకటేశ్వర స్వామి సైతం కుబేరుడుకి అప్పుల ఉన్నాడని..వడ్డీలు కడుతుంటాడని అందుకే ఆయన్ని వడ్డీకాసుల వాడు అని కూడా పిలుస్తారు. అటువంటి వెంకటేశ్వరస్వామి తన భక్తుల మొర ఆకలించి ‘అప్పుల’నుంచి విముక్తి కలిగించే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. అయితే, అప్పులు చేసిన వారు తమ అప్పులను త్వరగా తీర్చుకోవాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయానికి వెళ్తే చాలు.

allroudadda

అదే చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం.. ఇది జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో ఉంటుంది. దీనిని తెలంగాణ తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. పైగా, సాక్షాత్తు కలియుగ దైవం ఆ వెంకన్న స్వామియే స్వయంగా తిరుపతి నుంచి.. నడుచుకుంటూ వచ్చి .. చిల్పూర్ గుట్టపై వెలశారని అక్కడి భక్తుల నమ్మకం. అయితే, అసలు ఆ స్వామి వారి చరిత్ర ఏంటో తెలుసుకుందాం. పూర్వం.. ఆ శ్రీమన్నారాయణ స్వామి వారు .. శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి.. పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుని వద్ద అప్పు చేశారట.

అయితే, ఈ సందర్భంలో వెంకన్న ఆ అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనితో అప్పు తీర్చాల్సిన సమయం దగ్గర పడే కొద్దీ.. స్వామి వారికీ మదిలో భయం మొదలైందట.ఈ క్రమంలో ఆ ఆలోచనలతో నిద్రిస్తున్న స్వామికి.. స్వప్నంలో ఈ చిల్పూర్ ప్రదేశం అంతా కనిపిస్తుందట. దీనితో నిద్రలోనుంచి మేల్కొన్న స్వామి వారు నడుచుకుంటూ .. ఈ చిల్పూర్ గుట్ట వద్దకు వస్తారట. ఆ గుట్ట కింద భాగంలో ఆయన తన పాదరక్షలు విడిచిపెట్టి.. కొండపై ఉన్న గుహలోకి వెళ్లి తపస్సు చేస్తారట..

ఇక ఆ సమయంలో ప్రత్యేక్షమైన కుబేరునికి స్యామి వారు క్షమాపణ కోరుతారు. ఈ ప్రదేశానికి వచ్చినందుకు .. నా సమస్యకు పరిష్కారం దొరికిందని స్వామి వారు సంతోషిస్తారు. కాబట్టి, ఈ కారణంగా స్వామి వారు ఆ ఆలయానికి వెళ్లే భక్తులకు .. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కార మార్గాలు చూపిస్తారని భక్తుల నమ్మకం. కాబట్టి ఆర్థిక బాధలతో సతమతమౌతున్న వారు.. ఈ ఆలయానికి వెళితే మంచిదని చెబుతున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Leave a Reply