Prabhas Donation | వాళ్ళ కోసం 35 లక్షలు విరాళం ఇచ్చిన ప్రభాస్ !

Prabhas Donation | ప్రభాస్ నటిస్తున్న కల్కి (Kalki) సినిమాకు సంబంధించి పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ సినిమా మే నెల 30వ తేదీన విడుదలవుతుందని ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏపీ ఉన్నతాధికారుల నుంచి హామీ లభించిందని తెలుస్తోంది. అయితే 4 సీజీ షాట్స్ వర్క్ వల్ల రిలీజ్ డేట్ ను ప్రకటించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన సస్పెన్స్ కు తెరపడనుందని తెలుస్తోంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొనిరావడానికి కల్కి మేకర్స్ సైతం కష్టపడుతున్నారు.సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే ప్రభాస్ మంచి మనసు గురించి తెలిసిందే. షూటింగ్ లో, లేదా తన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపిస్తాడు. ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఎంతోమంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు మాట్లాడుతూనే ఉంటారు.

ఇక ప్రభాస్ ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు. డొనేషన్స్ కూడా ఇచ్చారు గతంలో.తాజాగా ప్రభాస్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్(Telugu Film Directors Association) కి డొనేషన్ ఇచ్చారు. త్వరలో మే 4న దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని ఈ సారి ఘనంగా నిర్వహించబోతున్నారు. స్టేడియంలో భారీ జనల మధ్య టాలీవుడ్ లోని ప్రముఖులు అంతా హాజరవ్వగా ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయబోతున్నారు.

Temple | అప్పులు అలాగే దరిద్రాన్ని దూరం చేసే దేవాలయం.. ఎక్కడ అంటే..?

దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కార్యక్రమం నిన్న రాత్రి జరగ్గా ఈ కార్యక్రమానికి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు, చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు.ఈ కార్యరామంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. మన డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం ప్రభాస్ గారు 35 లక్షలు ప్రకటించారు. ఇందాకే కాల్ చేసి ప్రభాస్ గారు మాట్లాడి 35 లక్షలు ఇస్తానని చెప్పినట్టు తెలిపారు. దీంతో ప్రభాస్ పై దర్శకుల సంఘం అభినందనలు కురిపించారు. ఇక ఈ విషయం వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు, నెటిజన్లు మరోసారి ప్రభాస్ మంచి మనసుని అభినందిస్తున్నారు. ఇటీవల దర్శకుల సంఘంకి నిర్మాత SKN కూడా 10 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Recent Posts

Leave a Reply