Diabetes : మటన్ తింటే షుగర్ వస్తుందా? అసలు ఇందులో నిజమెంత?

Diabetes : ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య షుగర్. అదే మదుమేహ వ్యాధి. దీన్నే ఇంగ్లీష్ లో డయాబెటిస్ అంటారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఈ వ్యాధి ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారు. మారుతున్న మనిషి జీవన శైలే డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతోంది.అయితే.. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలంటే.. ఖచ్చితంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేయాలి.

ఖచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. కొలెస్టరాల్ ను నియంత్రణలో ఉంచుకోవాలి.షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు చెడు కొలెస్టరాల్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. చెడు కొలెస్టరాల్ అంటే.. ఎల్డీఎల్, ట్రై గ్లిజరాయిడ్స్. ఇవి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ల శరీరంలో ఎంత తక్కువగా పేరుకుపోతే.. అంత బెటర్.ఒకవేళ.. ఎల్డీఎల్ కొవ్వు ఎక్కువగా ఉంటే.. షుగర్ ఉన్నవాళ్లకు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే.. ఎల్డీఎల్ కొవ్వును షుగర్ ఉన్న వాళ్లు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే.. ట్రై గ్లిజరాయిడ్స్ ను కూడా తగ్గించుకోవాలి.

మటన్ తగ్గించుకోవాలి..

షుగర్ తో బాధపడుతూ.. చెడు కొవ్వు ఎక్కువగా ఉంటే.. వాళ్లు ఖచ్చితంగా మటన్ తినడం తగ్గించాలి. రెడ్ మీట్, పొట్టేలు మాంసం, మేక మాంసాన్ని తగ్గించాలి. షుగర్ ఉన్నవాళ్లు తినే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండాలి కానీ.. కొవ్వు ఉండకూడదు. మటన్ లో ఎక్కువ కొవ్వు ఉంటుంది. అది షుగర్ లేవల్స్ ను అమాంతం పెంచుతుంది.ఒకవేళ మటన్ తినాలనిపిస్తే.. కొద్దిగా కొవ్వు లేకుండా.. చాలా రోజులు గ్యాప్ ఇచ్చి తీసుకుంటే బెటర్. అదేపనిగా.. రోజూ మటన్ తింటే మాత్రం ఖచ్చితంగా షుగర్ లేవల్స్ పెరిగి.. ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

Leave a Reply