Telangan | తెలంగాణ అసెంబ్లీలో జ‌గ‌న్ , చంద్రబాబు పేరు ఎత్తిన కేటీఆర్.. ద‌ద్ద‌రిల్లిన స‌భ‌.

Telangana | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు వాడీవేడీగా సాగాయి. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, టిమ్స్‌ ఆసుపత్రుల బిల్లు, కర్మాగారాల చట్ట సవరణ బిల్లు, రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం రూపొందించిన బిల్లు, మైనార్టీ కమిషన్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు పల్లె, పట్టణ ప్రగతిపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ లేదా బీజేపీ గెలిస్తే.. ఆ పార్టీలు ప్రతిదానికి చలో ఢిల్లీ అంటాయన్నారు. ఆ రెండు పార్టీలు ఢిల్లీ వదిలిన బాణాలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ది పక్కరాష్ట్రమైన ఏపీ సీఎం జగన్(cm ys jagan), ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అర్థం అవుతుందని.. కానీ భట్టి, రఘునందన్ రావు లాంటి వాళ్లకు మాత్రం అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా జగన్, చంద్రబాబుకు కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.దిశ సంఘటన చోటు చేసుకున్న తరువాత తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాల గురించి జగన్.. ఏపీ అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిండు సభలో జగన్ సెల్యూట్ చేశారని అన్నారు. ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదన్నారు.

ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనచ్చునని అన్నారు. ఈ మాట వాస్తవం కాదా.. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పలేదా అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.బీఆర్ఎస్ పార్టీ, తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన టీపీసీసీ రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశామని.. రేవంత్ అంతుచూస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

Leave a Reply