Varalaxmi – Vishal | పాపం వరలక్ష్మీ – విశాల్ లవ్ బ్రేక్ అప్ కి కారణం అదేనా..?

allroudadda

Varalaxmi – Vishal | ప్రముఖ నటుడు విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించారు. ప్రస్తుతం ఆమె లేడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు క్రాక్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, నాంది సినిమాలో జెంటిల్ లాయర్ గా ఆకట్టుకున్నారు.

అయితే అప్పట్లో వరలక్ష్మీ శరత్ కుమార్, విశాల్ పై లవ్ ఎఫైర్ ఉన్నట్లు వార్తలు హోరెత్తాయి. ఇక ఇది రాధికా,శరత్ కుమార్ ల మధ్య విబేధాలకు దారితీసింది. అయితే విశాల్ తో ప్రేమకు ఒప్పుకోకపోవడంతో నడిగర సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ కి వ్యతిరేకంగా విశాల్ పని చేసి ఓడించారు. అయితే ప్రేమను కాదని తిరస్కరించినందుకు ఎన్నో సినిమాలు చేస్తూ,సామాజికంగా కూడా ఎందరికో సాయం చేస్తూ మంచి పేరు కూడా విశాల్ తెచ్చుకున్నారు. వరలక్ష్మితో బ్రేక్ అప్ అయ్యాక అమీషాతో ప్రేమాయణం చేసి పెళ్లి చేసుకున్నారు.

ఇక ఒక్కనొక్క సందర్భంలో విశాల్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇద్దరు ఈ విషయంపై సంపాందించారు. ఇక ఇద్దరు మంచి స్నేహితులమని మీడియాకు తెలిపారు. ఇక ఇద్దరు ఎప్పుడు కలిసిన కష్ట సుఖాలను గురించి ఒకరికి ఒకరం షేర్ చేసుకుంటూ ఉంటామని అన్నారు. అయితే వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా షికారు చేస్తోన్న వార్తలు తమ వరకు వచ్చాయని అన్నారు. కాగా.. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు అని ఇద్దరు వెల్లడించారు.

Trisha | దేవుడా.. త్రిష అంత‌మందితో ల‌వ్ ఎఫైర్ న‌డిపిందా.. |

అమ్మాయి, అబ్బాయి స్నేహితుల ఉండి, మాములుగా బయటికి వెళ్తే.. లవ్ అయిపోతుందా అంటూ వాళ్ళు వాపోయారు. ఇక తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఘనంగా జరిగింది. దీనిపై విశాల్ స్పందించారు. వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నందుకు తాను సంతోషిస్తున్నానని తెలిపారు. ఆమె కెరీర్ లో ఎదగాలన్న లక్ష్యాన్ని అందుకుందని, తెలుగులో ఎంతో గుర్తింపు సాధించిందని, అందుకు ఆనందిస్తున్నానని పేర్కొన్నారు.

Recent Posts

Leave a Reply