Priyanka Singh | ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్..

allroudadda

Priyanka Singh | అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ప్రియాంక సింగ్ జబర్దస్త్ లాంటి పలు టీవీ షోలతో పేరు తెచ్చుకుంది. అనంతరం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయింది. బిగ్ బాస్(Bigg Boss) తర్వాత టీవీ షోలు, సినిమా ఛాన్సులతో బిజీగానే ఉంది ప్రియాంక సింగ్. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన కష్టాలు చెప్పింది ప్రియాంక. చిన్నప్పట్నుంచి పడ్డ కష్టాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దూరం పెట్టారని ఎమోషనల్ అయింది.

కానీ హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళ అమ్మ, నాన్న వచ్చి మళ్ళీ దగ్గరకు తీసుకోవడంతో ప్రియాంక ఎమోషనల్ అయింది.తాజాగా యూట్యూబర్ నిఖిల్ కి ప్రియాంక సింగ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలని తెలిపింది. ప్రియాంక మాట్లాడుతూ.. తన అసలు పేరు, అమ్మాయిగా మారక ముందు తేజ్ బహదూర్ సింగ్ అని చెప్పింది. ఇలా తమలో ఆ లక్షణాలు ఉండి అమ్మాయిగా మారాలనుకున్న వాళ్ళు కచ్చితంగా హార్మోన్ థెరపీ తీసుకోవాలని, తనకి చిన్నప్పుడే తనలో అబ్బాయి కంటే అమ్మాయి లక్షణాలే ఎక్కువ ఉన్నట్టు అర్థమైందని తెలిపింది.

allroudadda
allroudadda

అలాగే ఇండస్ట్రీలోకి వచ్చాక.. అవకాశాల కోసం ఇలా మారిపోయావా అని చాలామంది అన్నారు. ఒకరిద్దరు నీతో ఉండాలని ఉంది, నైట్ కి ఎంత ఛార్జ్ చేస్తావు అని అడిగారు. నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక పని చెయ్, మీ నాన్న మీ అమ్మతో ఆ పని చేసినందుకు ఎంత తీసుకుందో అడిగి తెలుసుకుని, అంత నాకు ఇవ్వు… అని ప్రియాంక కామెంట్ చేసింది. ఆ ఆన్సర్ తో అతని మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రియాంక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Recent Posts

Leave a Reply