వరుణ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ !కట్నం ఎంతో తెలుసా.

మెగా హీరోలలో వరుణ్ తేజ్ భిన్నమైన వ్యక్తి. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసిన వరుణ్ తేజ్… అందులో చాలా డిఫరెంట్ కథాంశాలను ఎంచుకొని తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా చేస్తున్నాడు వరుణ్ తేజ్. అయితే గత కొంతకాలంగా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మధ్య లవ్ ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే తాజాగా యంగ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం జరుగనుంది. ఈ మేరకు వరుణ్ తేజ్ టీం, మెగా అభిమాన సంఘాలు అఫీషియల్ గా ప్రకటించాయి. ఎంగేజ్మెంట్ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వరుణ్ తేజ్, లావణ్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలో నటించారు. ఆ సినిమా ప్లాప్ గా నిలిచినప్పటికీ షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వరుణ్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో అంతరిక్షం సినిమా వచ్చింది.

Leave a Reply