నా భార్య లేకపోతే ఐదేళ్ల క్రితమే చనిపోయేవాడిని… పంచ్‌ ప్రసాద్‌!

జ‌బ‌ర్ద‌స్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పంచ్ ప్ర‌సాద్(Punch Prasad ) ఒక‌రు. ఈయ‌న కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే.. పంచ్ ప్ర‌సాద్ గ‌త కొంత‌కాలంగా కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. రెగ్యుల‌ర్‌గా డ‌యాసిస్ చేయించుకుంటున్నారు. చికిత్స‌తో కోలుకుని కొన్నాళ్లు జ‌బ‌ర్ద‌స్త్‌లో క‌నిపించారు.

కాగా ఇప్ప‌డు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియెన్ నూక‌రాజు(Jabardasth Emmanuel) సోషల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అత‌డికి ఆప‌రేషన్ చేయాల‌ని వైద్యులు చెప్పిన‌ట్లు నూక‌రాజు తెలిపాడు. అయితే.. అందుకు పెద్ద మొత్తంలో ఖ‌ర్చు అవుతుంద‌ని, ఈ విష‌యంలో దాత‌లు సాయం చేయాల‌ని కోరాడు. ‘అన్నకు సీరియస్‌గా ఉంది. ఆప‌రేష‌న్ చేయాల‌ని డాక్ట‌ర్లు చెప్పారు.

అందుకు చాలా ఖ‌ర్చు అవుతుంది. మేమంతా ట్రై చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో నూక‌రాజ్ పోస్ట్ పెట్టాడు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న అతని పరిస్థితి ఇటీవల మరింత విషమించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

కాగా ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రసాద్ కున్న ధైర్యం, భరోసా ఒక్కటే.. అతని భార్య సునీత. కిడ్నీల సమస్యల ఉందని తెలిసినప్పటికీ అతనితో కలిసి జీవితం పంచుకునేందుకు సిద్ధమైన సునీత గొప్పతనం గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ప్రసాద్‌. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడిన ఈ జబర్దస్త్ కమెడియన్ మరోసారి తన సతీమణిపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన భార్య లేకపోతే ఐదేళ్ల క్రితమే చనిపోయేవాడినంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

Leave a Reply