కర్ణాటక సీఎం పదవి ఫిక్స్‌.. ఎవరంటే?

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై కొనసాగుతన్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేలా లేదు. అవినీతి బీజేపీ ప్రభుత్వానికి గట్టిబుద్ధిచెప్పిన కన్నడ ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని ఆధిక్యం కట్టబెట్టారు. అయితే పార్టీ విజయానికి కృషిచేసిన సిద్ధరామయ్య , డీకే శివకుమార్.. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో సీఎం ఎంపికలో పీఠముడి ఏర్పడింది. ఇద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తే మరొకరు తిరుగుబాటు చేస్తారా అనే సంశయం పార్టీలో నెలకొన్నది.

దీంతో పార్టీ అధిష్ఠానం సీఎం ఎంపికలో మల్లగుళ్లాలు పడుతున్నది.అయితే, ఎట్టకేలకు బుధవారం.. ఉత్కంఠకు తెరపడింది. సిద్ధూకు ఒకే అన్న కాంగ్రెస్‌ అధిష్టానం.. మరికాసేపట్లో ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.కాగా, ముందుగా ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య.. ఖర్గేతో మంగళవారం ఓ దఫా చర్చలు జరిపారు. నిన్న ఉదయం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లి ఖర్గేతో సమావేశమై చర్చలు జరిపారు. నిన్న మల్లికార్జున్ ఖర్గే నివాసంలో నిరంతరం సమావేశాలు, చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు.

కాగా, రాహుల్‌ గాంధీతో సిద్దరామయ్య బుధవారం సమావేశమయ్యారు. సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్‌ హైకమాండ్‌ మొగ్గు చూపుతున్నట్లు మధ్యాహ్ననికి క్లారిటీ రాగా, సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రొటేషన్‌ సీఎం ఫార్ములాను కాంగ్రెస్‌ హైకమాండ్‌ సూచిస్తోంది. డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. మరికాసేట్లో రాహుల్‌గాంధీని డీకే శివకుమార్‌ కలవనున్నారు.

Leave a Reply