Venkatesh wife | హీరో వెంకటేష్ భార్య నీరజ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..?

allroudadda

Venkatesh wife | టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా ఎంతో గుర్తింపు సాధించిన హీరో వెంకటేష్. ఫ్యామిలీ సినిమాలు చేస్తూ లేడీస్ ఫ్యాన్స్ ను సంపాదించుకోవడంతో వెంకటేష్ కు ఆ గుర్తింపు దక్కింది. అయితే వెంకటేష్ భార్య గురించి చాలామందికి తెలియదు. ఆమె ఎవరు? వాళ్ళ బ్యాగ్రౌండ్ ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…వెంకటేష్ భార్య పేరు నీరజారెడ్డి. కాగా, ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లి లో జన్మించారు.

నీరజ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి. బడా వ్యాపారవేత్త మరియు ఆయనకు సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇక వెంకటేష్ తండ్రి డి.రామానాయుడు సంబంధాలు వెతుకుతున్న సమయంలోనే నీరజా రెడ్డికి కూడా ఆమె తండ్రి తనకు సంబంధాలు చూస్తున్నాడు. అయితే నీరజారెడ్డి బంధువు అయినా నాగిరెడ్డికి రామానాయుడు వెంకటేష్ కు సంబంధాలు చూడమని చెప్పారు.దాంతో నాగిరెడ్డి మా బంధువుల అమ్మాయి ఉంది.

allroudadda
allroudadda

కానీ మీ కులం కాదు అంటూ సమాధానం ఇచ్చారు. రాయలసీమలోని మదనపల్లిలో ఏ కులం వారైనా పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం సర్వసాధారణమట. మదనపల్లి కొండపై రెడ్డమ్మ అనే దేవత ఉండడంతో ఆ అమ్మవారి భక్తులంతా పేరు చివరన రెడ్డి అని తగిలించుకుంటారట. నీరజ రెడ్డి కూడా కాపు కులానికి చెందినవారు.

కాగా, నాగిరెడ్డి సలహా మేరకు రామానాయుడు వెంకటేష్ తో కలిసి ఆమెను చూసి సంబంధం కాయం చేసుకున్నారు. ఇక నీరజారెడ్డి పేరుపై కోట్లలో ఆస్తులు ఉన్నాయట. ఇక వెంకటేష్ ఆస్తుల విలువ విషయానికి వస్తే.. రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈయనకి తన తండ్రి నుంచి వారసత్వముగా కూడా ఆస్తులు లభించినట్లు తెలుస్తుంది

Leave a Reply