Vidya Balan | నేను నిజంగా దానికోసమే పెళ్లి చేసుకున్నాను.

allroudadda

Vidya Balan | ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విద్యాబాలన్ ఎప్పుడూ ఒక సంచలనమే. ‘డర్టీ పిక్చర్’తో విద్యాబాలన్ ఫిలిం ఇండస్ట్రీన్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక 2012లో సిద్ధార్థ్ రాయ్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎప్పుడూ ఏదొక వివాదంతో వార్తల్లో ట్రెండ్ అయ్యే విద్యా.. రీసెంట్ గా మీడియా ముఖంగా తన భర్త గురించి, పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేసి షాకిచ్చింది. ఈ సందర్బంగా విద్యా మాట్లాడుతూ..

‘అందరిదీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే.. మా ఆయనతో నాది లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. మేం తొలిచూపులో కా మంతో కనెక్ట్ అయ్యామని అనుకుంటాను. మా మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పటికీ.. మేం ఫిజికల్ గానే అట్రాక్ట్ అయ్యాం. ఎందుకంటే నా భర్త అందగాడు. హ్యాండ్సమ్ నెస్ తో పాటు బాగా కేరింగ్ గా ఉంటాడు. ఆ విధంగా నేను సిద్దార్థ్ కి కనెక్ట్ అయ్యాను.” అని చెప్పుకొచ్చింది.

ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘నేను మా నాన్న వద్ద చాలా సెక్యూర్డ్ గా భావిస్తాను. ఆ క్వాలిటీ సిద్ధార్థ్‌ లో చూసుకున్నాను. ఆ విషయమే నన్ను అతని వైపు నడిపించింది. తను చాలా ప్రైవేట్‌ గా ఉంటాడు. ఇక మా ప్రేమలో ముందుగా తానే ప్రపోజ్ చేశాడు. మొదట్లో ప్రతి చిన్నదానికి ఓవర్‌ గా రియాక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు కామ్ అయిపోయాను.’ అని చెప్పింది. ప్రస్తుతం విద్యా మాటలు సినీ వర్గాలలో వైరల్ అవుతున్నాయి.

Recent Posts

Leave a Reply