Rashmika Mandanna | సినిమాల్లో నాకంటే అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు…

Rashmika Mandanna | రష్మిక తెలుగు, హిందీల్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో నటిస్తున్నారు. అందులో శ్రీవల్లిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘పుష్ప’ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టడం, అందులోని నటనకుగాను అల్లు అర్జున్‌కు జాతీయఅవార్డు రావడం, దేవిశ్రీ ప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన రష్మిక లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే రష్మిక తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ …తనకంటే అద్భుతమైన అందం మరియు టాలెంట్ కలిగిన ఎంతో మంది అమ్మాయిలు సినీ పరిశ్రమలో ఉన్నారు. తనకు మంచి అవకాశాలు రావడం … అలాగే నేను నటించిన సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో నేను ప్రస్తుతం సినీ పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకున్నాను అని తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చింది.

ఇలా రష్మిక వరుస విజయాలతో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఏ మాత్రం గర్వం లేకుండా … తనకు అదృష్టం కలిసి వచ్చింది. అందుకే నేను నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అందుకే నేను ఈ స్థానంలో ఉన్నాను. నా కంటే టాలెంట్ , అందం ఉన్న అమ్మాయిలు ఎంతో మంది ఇండస్ట్రీ లో ఉన్నారు.అని ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. రష్మిక ఇంత గొప్ప వ్యక్తిత్వంతో మాట్లాడడంతో ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

Recent Posts

Leave a Reply