Tamannaah | మాల్దీవుల్లో తమన్నా లేటెస్ట్ పిక్స్ చూస్తే కళ్ళు చెదరాల్సిందే..

Tamannaah | మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత ‘హ్యాపీ డేస్’ తో స్టార్ డంని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి తన రేంజ్ ను ఇంకా పెంచుకుంది. ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు కావస్తున్నా ఇంకా బిజీగానే రాణిస్తుంది.

కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువైనప్పటికీ కూడా తమన్నా తట్టుకుని ఇంకా నిలబడుతుంది అంటే దానికి ప్రధాన కారణం ఆమె గ్లామర్ అనే చెప్పాలి.నటిగా ఆమె ప్రయోగాలు చేసి విఫలమైన టైంలో తన అందాన్ని అస్త్రంగా వాడుతూ ఉంటుంది ఈ బ్యూటీ. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తమన్నా ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంది. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తోంది. సోనేవా పుషి అనే రీసార్ట్ లో దిగిన ఆమె.. అక్కడి బీచ్ లో విచ్చల విడిగా అందాలు ఆరబోస్తుంది.

ఆమె వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమన్నా (Tamanna) వీటిని పోస్ట్ చేయగా కొద్దిసేపటికే అవి వైరల్ గా మారాయి అని చెప్పొచ్చు. ఈ ఫొటోల్లో తమన్నా బికినీలో అందాలు వడ్డించడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమన్నా అందాన్ని ఆరాధించేవారికి ఈ ఫోటోలు ఫుల్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూడండి.

Leave a Reply