Heroine Ashwini | 100సినిమాలలో నటించిన నటి.. కానీ ఆఖరి రోజుల్లో తిండి లేక…

Heroine Ashwini

Heroine Ashwini | నిన్నటి తరం నటి అశ్విని చాల మందికి గుర్తుండే ఉంటుంది. వందకు పైగా తెలుగు చుత్రాల్లో నటించిన అశ్విని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 150 సినిమాల్లో నటించారు. 80, 90, లలో అశ్విని హీరోయినిగా చలామణి అయ్యింది. అశ్విని సొంత వూరు నెల్లూరు. సినిమా ఛాన్సుల కోసం చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. నటుడు, దర్శకుడు పార్తీబన్ ఆమెను మొదటగా పొండాటి తేవై అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీ కి పరిచయం చేయగా, ఆమె ఆయనతో అనేక సినిమాలో నటించింది.

ఒక్క సినిమాలే కాదు సినిమా అవకాశాలు తగ్గాక తమిళ సీరియల్స్ లో సైతం నటించింది. తెలుగులో అనాదిగా ఆడది, భలే తమ్ముడు, అరణ్య కాండ, అత్తగారు స్వాగతం, దొర బిడ్డ, కొంటే కాపురం, త్రిమూర్తులు, భానుమతి గారి మొగుడు, అమెరికా అబ్బాయి, కలియుగ పాండవులు, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు, పెళ్లి చేసి చూడు, ప్రేమ కిరీటం, వేగు చుక్క-పగటి చుక్క, స్టేషన్ మాస్టర్, గోపాలరావ్ గారి అబ్బాయి, కొడుకు దిద్దిన కాపురం, పూల రంగడు, భార్యా భర్తల భాగోతం, ఆఖరి క్షణం, రక్త జ్వాల వంటి చిత్రాల్లో నటించింది.

Heroine Ashwini
Heroine Ashwini

తెలుగు, మలయాళం, కన్నడ, తమిళంలో మొత్తం 100కు పైగా చిత్రాల్లో నటించింది. అయితే ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే ప్రముఖ రచయిత పువియరుసు మనవడితో రహస్య వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. భర్త ఆమెను మోసం చేశాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.ఓ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంది. భర్త మోసం చేశాడని తట్టుకోలేకపోయిన అశ్విని.. మానసికంగా కుంగ్రిపోయింది. తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి.

Health Benefits | నాన బెట్టిన ఖర్జూరం తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ వెళ్లేంది. పేరుకు పెద్ద హీరోయిన్నే కానీ.. ఆమె ఏ ఆస్తులు కూడ బెట్టలేదు. చెన్నైలో ఓ ఇల్లు మాత్రమే ఉండేదట. చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులకు గురై అది కూడా అమ్మేసిందని వార్తలు వచ్చాయి. అద్దె ఇంట్లో ఉంటూ.. జీవించసాగింది. 2012లోరీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది.. ఆమె అనారోగ్య సమస్యలతో 2012 సెప్టెంబర్ 23న మరణించింది. 45 ఏళ్లకే నూరేళ్ల జీవితాన్ని చూసింది. ఆమె చనిపోయినప్పుడు స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు డబ్బుల్లేకపోతే.. తమిళ హీరో పార్తీబన్ సాయం అందించాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించాడు.

Recent Posts

Leave a Reply