Hyper Aadi | పవన్ కల్యాణ్ కోసం కన్నీరు పెట్టుకున్న హైపర్ ఆది..

allroudadda

Hyper Aadi | తెలుగు టీవీ‌ ఛానెల్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు హైపర్ ఆది గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోలో కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల గురించి ఈ షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీలైనపుడల్లా.. మెగా హీరోలపై అభిమానం చూపించే హైపర్ ఆది. .ఎన్నో సందర్భాల్లో జనసేన కార్యకర్తగా ఆయన ప్రసంగాలు చేశాడు. పవన్ ను ఎవరైనా ఒక్క మాట అన్నా… వారికి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడడు.

తాజాగా టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లను కేటాయించారు. దీంతో పవన్ కల్యాణ్ పై ఆయన అభిమానులు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది స్పందిస్తూ… పవన్ అమ్ముడుపోయే వ్యక్తి కాదని అన్నారు. సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తి అని చెప్పాడు. కేవలం 24 సీట్లకే తలొగ్గడం ఏమిటని పవన్ గురించి మాట్లాడుతున్నారని…

allroudadda
allroudadda

2019లో ఆయనను గెలిపించుకోలేని మనకు ఆయన గురించి మాట్లాడే హక్కు ఉందా? అని హైపర్ ఆది ప్రశ్నించాడు. సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ అని కొనియాడాడు. రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసకునే పవన్… సంపాదన మొత్తాన్ని సహాయ కార్యక్రమాలకు పెట్టేసి… ఇప్పుడు దాదాపుగా అప్పు చేసి పార్టీని నడుపుతున్నారని చెప్పాడు. చిన్న పరీక్షలో ఫెయిల్ అయతేనే మనం పది రోజులు బయటకు రాలేమని… అలాంటిది రెండు చోట్ల ఓడిపోయినా రెండో రోజే కౌలు రైతుల కష్టాలు తీర్చిన గొప్ప మనసు పవన్ దని కొనియాడాడు.

Akash Puri  | పూరీ జగన్నాథ్ కొడుకుతో హేమ కూతురు పెళ్లి..?

కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టారని, ప్యాకేజీ తీసుకున్నాడని చాలా ఈజీగా కామెంట్ చేస్తున్నారని… ఇలాంటి మాటలు ఎందుకని హైపర్ ఆది అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికారంలో ఉన్న వైసీపీ వద్ద ఎక్కువ డబ్బు ఉందని… అలాంటప్పుడు వైసీపీ దగ్గరకు పవన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించాడు. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం… అనుకూలంగా లేనప్పుడు బై చెప్పడం కాదని అన్నాడు. నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్నే అభిమానం అంటారని చెప్పారు. మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడకూడదని హితవు పలికాడు.

Leave a Reply