Belly Dance | యువకుడి బెల్లి డాన్స్ చూస్తే … మతి పోవాలిసిందే..!

Belly Dance | ఒక్కమాటలో అసలు సిసలైన డ్యాన్సర్ గా ప్రతిభ కలిగి ఉండటమంటే అది పూర్వ జన్మసుకృతం అని అంటారు నాట్యాచార్యులు.ఇక అసలు విషయానికొస్తే మనం చాలా రకాలుగా ఎన్నో రియాలిటీ షోలలో, బయట ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లను మనం చూస్తూ ఉంటాం.కొన్ని సార్లు ఒళ్ళు గగుర్పొడిచే డ్యాన్స్ లను చూస్తే ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకొని ఉత్కంఠగా ఆ డ్యాన్స్ ని మనం ఆద్యంతం వీక్షిస్తూ ఉంటాం.

ఇదంతా ఒకెత్తు ఇప్పుడు మీరు చూడబోయేది ఒకెత్తు.ఎందుకంటే అబ్బాయి బెల్లీ డ్యాన్స్‌ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.నిజానికి డ్యాన్స్‌లో లింగ భేదం ఉండదు.. దేశం, భాష, ప్రాంతం అనే తేడాలు కూడా లేకుండా అందరూ సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేస్తారు. అదేవిధంగా అమ్మాయిలు ఎక్కువగా చేసే ఈ బెల్లీ డ్యాన్స్ అమ్మాయిలనే సిగ్గుపడేలా చేసింది. ఇప్పుడు అతని డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

పాపం దీనస్థితిలో నటి పావలా శ్యామల… తిండిలేక.. అద్దె కట్టలేని పరిస్థితి..

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా వెరైటీగా కామెంట్ చేస్తూ బాలీవుడ్ నటి డ్యాన్సర్ల కంటే కూడా నువ్వు సూపర్‌గా డ్యాన్స్ చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రతిభకు అవకాశం రాలేదని ఏడవాల్సిన పనిలేదు, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ తమకంటూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను సిద్ధం చేసుకుని తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సోషల్ మీడియాలో వేల మంది వీక్షించారు. తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ యువకుడు బెల్లీ డ్యాన్స్ బాగా చేసాడు. యువకుడి డ్యాన్స్‌కి జనాలు ఫిదా అయ్యారు.

Leave a Reply