Pawan Nomination | భారీ ఊరేగింపుతో పవన్ నామినేషన్.. అదే సి‌ఎం అయితే..?

allroudadda

Pawan Nomination | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే మూడు వంతులకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసి, ఎన్నికల కురుక్షేత్రంలో హోరాహోరీగా తలపడుతున్నారు.నామినేషన్ల గడువు పూర్తి కావడానికి మరో రెండు రోజులే ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు చాలా వరకు నామినేషన్లను దాఖలు చేశారు.పవన్ కళ్యాణ్ హనుమాన్ జయంతి సెంటిమెంట్

ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా, తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన పవన్ కల్యాణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు.

allroudadda
allroudadda

అక్కడ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ పక్కన ఆయన సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. నామినేషన్ అనంతరం పవన్ చేబ్రోలు తిరిగి వచ్చారు. ఈ సాయంత్రం ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. కాగా, పవన్ నామినేషన్ ర్యాలీలో మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AP 10Th ఫలితాల్లో సంచలనం.. 600లకు ఏకంగా 599 మార్కులు..

కిలోమీటర్ల పొడవునా బైకులు, వాహనాలతో పవన్ ను అనుసరించిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. నామినేషన్ వేసేందుకు బయల్దేరే ముందు పవన్… తన విజయం కోసం ప్రార్థించిన ఓ క్రైస్తవ మహిళకు పాదాభివందనం చేశారు. కాగా, నామినేషన్ వేయడానికి వెళుతున్న పవన్ కల్యాణ్ కు పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అర్ధాంగి హారతి ఇచ్చి తిలకం దిద్దారు. వర్మ… పవన్ కు శాలువా కప్పారు.

Leave a Reply