Puri | దర్శకుడు పూరీ పెళ్లికి తాళి బొట్టు కొనిచ్చిన టాప్ యాంకర్ ఎవరో తెలుసా.?

allroudadda

Puri | బద్రి సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి కావడం.. అలాగే తన కెరీర్ కూడా 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో జోష్ మీద కనిపిస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. గతేడాది ఈయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ కూడా మంచి విజయం సాధించడంతో ఈయనలో తెలియని జోరు వచ్చేసింది. తన కెరీర్ 20 ఏళ్ల సందర్భంగా చాలా విషయాల గురించి మనసు విప్పి మాట్లాడుతున్నాడు పూరీ. ముఖ్యంగా ఈయన జీవితంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన గురించి చెప్పుకున్నాడు పూరీ.

తన పెళ్లి గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు పూరీ జగన్నాథ్. తను ప్రేమించిన అమ్మాయిని దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడు ఈ దర్శకుడు.పూరీ పెళ్లి సినిమా ట్విస్టుల కంటే ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా తన పెళ్లి సినిమాటిక్ స్టైల్లో జరిగిందని గుర్తు చేసుకున్నాడు పూరీ జగన్నాథ్. నిన్నే పెళ్లాడతా సినిమాకు పని చేస్తున్న సమయంలోనే తాను ప్రేమలో పడ్డానని.. పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాడు పూరీ. అప్పటికి తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని.. కానీ స్నేహితులు మాత్రం అప్పుడు తనకు అండగా నిలిచారని చెప్పాడు పూరీ.

allroudadda
allroudadda

తన పెళ్లి ఎర్రగడ్డలోని ఓ గుడిలో జరిగిందని గుర్తు చేసుకున్నాడు ఈయన. అప్పటి టాలీవుడ్ టాప్ యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందని.. ఇక నటి హేమ తనకు పెళ్లి బట్టలు తీసుకొచ్చిందని చెప్పాడు పూరీ జగన్నాథ్. ఇక అక్కడే ఉన్న మరికొందరు స్నేహితులు కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చారని చెప్పాడు ఈ సంచలన దర్శకుడు. పెళ్లి బట్టలు కట్టుకుని తాళి బొట్టు కట్టేసి కూల్ డ్రింక్ తాగేసి ఎంచక్కా సాయంత్రం మళ్లీ షూటింగ్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు పూరీ.

Recent Posts

Leave a Reply