Raghavendra Rao: డైరెక్టర్ రాఘవేంద్ర రావు గురించి మీకు తెలియని కొన్ని నిజాలు..!

శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు K. Raghavendra Rao. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఆన్ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారు దర్శకేంద్రుడు. రొమాంటికి పాటలకు ఆయన పెట్టింది పేరు. అలాగే భక్తిరస సినిమాలు తీయడంలోనూ దిట్ట. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు రాఘవేంద్రరావు.

ఇక రాఘవేంద్ర రావు ప్రతిభకు ఎన్నో అవార్డులు వరించాయి.అది పక్కన పెడితే అతని ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు.. తన తండ్రి ప్రకాష్ రావు తన తల్లిని కాదని నటి వరలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వరలక్ష్మికి ,ప్రకాష్ రావుకి ఏకైక సంతానం.. అతని పేరు కూడా ప్రకాష్ రావే.. సినిమా ఇండస్ట్రీలో కెమెరామెన్ గా పనిచేశాడు.

అయితే ఆ తర్వాత దర్శకుడిగా మారాడు . మోహన్ బాబుతో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన అనుకోని కారణాల వల్ల అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు వరలక్ష్మి జీవించి వృద్ధాప్య కారణాలతో ఆమె కూడా కళ్ళు మూసింది..అయితే తండ్రి ప్రకాష్ రావు ఆస్థిలో వరలక్ష్మి Varalakshmi కుమారుడికి కూడా వాటా ఉండాల్సింది. కానీ వరలక్ష్మీ ప్రకాష్ రావును వదిలేసి.. ఒక పహల్వాన్ తో ప్రేమలో పడి అతని కోసం వెళ్ళిపోయింది.

ఆ తర్వాత ఆమెని ప్రకాష్ రావు Prakash Rao కుటుంబం పూర్తిగా దూరం పెట్టింది. వరలక్ష్మి శాతం మళ్ళీ ప్రకాష్ రావు కుటుంబానికి దగ్గర కావాలని ఏ రోజు అనుకోలేదు. ప్రకాష్ రావు ఆస్తి లో ఆమె కుమారుడికి ఎలాంటి వాటా దక్కలేదు. అయితే వరలక్ష్మి కొడుకు ప్రకాష్ రావు మరణించిన తర్వాత అతని భార్య , పిల్లలు రోడ్డున పడతారని రాఘవేంద్రరావు పెద్దమనసు చేసుకొని వారిని పోషిస్తూ వచ్చాడు. సవతి తల్లి కొడుకు కుటుంబాన్ని సాకుతున్న విషయం ఆయన ఏనాడు చెప్పలేదు.

Leave a Reply