Roja’s Daughter: స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్ చేయబోతున్న రోజా కూతురు..!

సీనియర్ నటి, మంత్రి రోజా కూతురు అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని గత కొన్నిరోజులుగా న్యూస్ తెగ వైరల్ అవుతున్నాయి. అన్షుమాలికకు అందంతో పాటు నటనపై ఆసక్తి ఉండటంతో టాలీవుడ్​లో ఆమె ఎంట్రీ త్వరలోనే ఉండనుందని అభిమానులు సంబురపడి పోతున్నారు. రోజా అభిమానులైతే..

అన్షుమాలిక త్వరగా ఎంట్రీ ఇచ్చి తన తల్లిలాగే తాను కూడా సూపర్ హిట్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు. ఒక నటికి కావాల్సిన లక్షణాలన్నీ అన్షులో ఉన్నాయని భావిస్తున్నారు.అయితే ఇన్నాళ్లూ కేవలం అన్షుమాలిక టాలీవుడ్ ఎంట్రీ గురించే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి.

తాజాగా అన్షు ఏ హీరోతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వనుందనే విషయంపై కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చ నడుస్తోంది.అయితే తమిళ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్​తో అన్షు ఎంట్రీ ఇవ్వనున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. కోలీవుడ్ వర్గాల్లో ఈ వార్తలు వైరల్ అవుతుండటతో అన్షు తన ఫస్ట్ సినిమానే తెలుగు, తమిళం రెండు భాషల్లో తీస్తోందని రోజా అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. కానీ దీనిపై రోజా, అన్షుమాలిక, సెల్వరాజ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Leave a Reply