Roja Selvamani | కాస్త నల్లగా ఉన్నాను అని నువ్వు ఏం హీరోయిన్ అన్నారు..

allroudadda

Roja Selvamani | ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రి ‘రోజా సెల్వమణి’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారు. 2015 తరువాత సినిమాల్లో కనిపించని రోజా.. జబర్దస్త్ కామెడీ షోతో ఆడియన్స్ కి దగ్గర ఉన్నారు. అయితే మంత్రి పదవి చేపట్టిన తరువాత జబర్దస్త్ కి కూడా గుడ్ బై చెప్పేసి.. ప్రస్తుతం పొలిటికల్ గా బిజీ అయ్యారు.అయితే రోజా కూడా కెరియర్ మొదట్లో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు.

స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్న ఈమెను తొలి నాళ్ళల్లో నువ్వు అసలు హీరోయిన్ గా పనికి రావు అన్న వారున్నారు అని మీకు తెలుసా ? అవును ఇది నిజమే నటి రోజా కాస్త నల్లగా ఉంటారు, అయినా హైట్, ముఖంలో మంచి కళ, అంద్భుతమైన నటనా ప్రతిభ చూసి ఆమెని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆరంభంలో చాలామంది నువ్వు హీరోయిన్ ఎంటి.. నీ రంగుకి కనీసం సపోర్ట్ ఆర్టిస్ట్ గా కూడా కాలేవు.

allroudadda
allroudadda

ఏదో ఈ ఒక్క సినిమా అంతే అని ఆ తర్వాత ఇక నీకు ఛాన్స్ లు దొరకవు అని కామెంట్ చేశారట.అయితే వాటిని సీరియస్ గా తీసుకున్న రోజా పట్టుదలతో అవకాశాలు తనని వెతుక్కుని వచ్చేలా తన నటనతో ఆకర్షించారు. విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకున్న అవార్డులు అందుకున్న సందర్భాలెన్నో ఉన్నాయట. ఆ తర్వాత తమిళ దర్శకుడు సెల్వమణి ని బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక హీరోయిన్ గానే కాకుండా సెకండ్ ఇన్నిగ్స్ లో వయసుకు దగ్గ పాత్రలను చేస్తూ అలరించారు.

allroudadda
allroudadda

రాజకీయ రంగం లోనూ ప్రవేశించి అక్కడ కూడా తన ఉనికిని చాటుకున్నారు రోజా.అయితే నిన్న మొన్నటి దాకా జబర్దస్త్ ది కి జడ్జిగా, మరికొన్ని షో లకు న్యాయ నిర్ణేతగా, వ్యవహరించిన ఈమె మంత్రి అయ్యాక తన పూర్తి సమయాన్ని ప్రజల కొరకే కేటాయించాలని కెమెరాకు దూరం అయిన విషయం తెలిసిందే. ఇక ఈమె జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న అందుకుగాను నెలకు 20 లక్షలకు పైగానే పారితోషికం తీసుకునేవారట, అలాగే బతుకు జట్కా బండి వంటి షోలకు ఒక ఎపిసోడు కు 50 వేల వరకు పుచ్చుకునే వారట ఇలా తన జీవితం లో నటిగా, భార్య గా, తల్లిగా, నాయకురిలాగా ఎన్ని అద్భుతాలను సృష్టించారు రోజా.

Leave a Reply