Sachin Tendulkar: రికార్డులు రారాజు.. సచిన్‌ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.. !

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్ టెండూల్కర్, క్రికెట్ కి రిటైర్మింట్ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయిపోయింది. అయితే ఇప్పటికే సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులు ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. మిగిలిన ప్లేయర్లు కలలో కూడా ఊహించనిన్ని పరుగులు, మ్యాచ్ లు, బౌండరీలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించాడు. క్రికెట్ దేవుడిగా కీర్తి ఘడించిన సచిన్ టెండూల్కర్..

ఏప్రిల్‌ 24న సచిన్‌ 50వ పడిలోకి అడుగుపెట్టారు. క్రికెట్‌లో లెక్కకు మించి సాధించిన రికార్డులు ఎన్నో. వంద సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు.. క్రికెట్ తన ఊపిరిగా క్రికెట్ ద్వారానే ఉన్నత స్థాయికి ఎదిగిన సచిన్ నికర ఆస్తుల విలువ కొన్ని నివేదికల ప్రకారం సుమారు 165 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1350 కోట్ల కంటే ఎక్కువ. బెంగళూరులో రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం.

11 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఇప్పుడు క్రికెట్ గాడ్ అయ్యాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన అంజలిని వివాహం చేసుకున్న సచిన్ ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు.సచిన్ వద్ద ఉన్న కార్ల ఖరీదు రూ. 15 కోట్లకంటే ఎక్కువ.ఖరీదైన కార్లు, బంగ్లా కలిగి ఉన్న సచిన్ పెప్సి, అడిడాస్, టీవీఎస్, బ్రిటానియా, వీసా, బూస్ట్, ఎయిర్‌టెల్, కోకాకోలా, కోల్గేట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ. 17 నుంచి 20 కోట్లు.

Leave a Reply