బీర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా ఎగబడిన జనాలు..! వైరల్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లోనిఅనకాపల్లి జిల్లాలో అదే జరిగింది. అనకాపల్లి (Anakapally) జిల్లా కాశింకోట మండలం బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్‌ అతుపుతప్పి బోల్తా పడింది (. దీంతో వ్యాన్‌లో ఉన్న బీరు బాటిళ్లు చెల్లాచదురుగా కిందపడిపోయాయి.

ఈ వార్త చుట్టుపక్కల ఊర్లకు నిమిషాల్లోని పాకింది. ఇంకేముందు జనాలు ఎగబడ్డారు. రోడ్డుపై పడి పగిలిపోయిన సీసాలను వదిలేసిన స్థానికులు.. మిగిలిన వాటిని ఎవరి చేతుల్లో ఎన్ని పడితే అన్ని ఎత్తుకెళ్లారు. వ్యాన్‌ బోల్తా పడటంతో రోడ్డుపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

దీంతో ప్రయాణికులు కూడా చేతికందినన్ని బీరు సీసాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. వ్యాన్‌లో 200 పైగా బీరు కాటన్లు ఉన్నాయని అధికారులు చెప్పారు.

Leave a Reply